Chief Minister: ‘పుదుమైపెణ్‌’తో పెరిగిన అడ్మిషన్లు

ABN , First Publish Date - 2023-02-09T08:30:50+05:30 IST

డీఎంకే ప్రభుత్వం గతేడాది ప్రారంభించిన ‘పుదుమైపెణ్‌’ పథకం వల్ల రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థినుల సంఖ్య 27 శాతం పెరిగిందని రాష్ట్ర

Chief Minister: ‘పుదుమైపెణ్‌’తో పెరిగిన అడ్మిషన్లు

- సీఎం స్టాలిన్‌

- మరో లక్షమంది విద్యార్థినులకు రూ.1000

చెన్నై, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): డీఎంకే ప్రభుత్వం గతేడాది ప్రారంభించిన ‘పుదుమైపెణ్‌’ పథకం వల్ల రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థినుల సంఖ్య 27 శాతం పెరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. తిరువళ్లూరు జిల్లా పట్టాభిరామ్‌ హిందూ కళాశాలలో బుధవారం ఉదయం జరిగిన సభలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ప్లస్‌-2 దాకా చదివి ప్రస్తుతం డిగ్రీ కోర్సులు చదివే మరో లక్షమంది విద్యార్థినులకు ప్రతినెలా రూ.1000లను వారి బ్యాంక్‌ ఖాతాల్లో చెల్లించే రెండో దశ ‘పుదుమైపెణ్‌’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఆ పథకం ద్వారా కొందరు విద్యార్థినులకు ఆయన బ్యాంక్‌ చెల్లింపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా మూడు విషయాలు తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. సచివాలయంలో మంగళవారం కొత్తగా ఎంపికైన ఎస్‌ఐలకు నియామక పత్రాలు అందజేసినప్పుడు ఎంపికైన ఎస్‌ఐల్లో మహిళలు అధికమని డీజీపీ చెప్పటం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమానికి తనతోపాటు వచ్చిన మంత్రులు పొన్ముడి, నాజర్‌ కబుర్లాడుతూ పుదుమైపెణ్‌ పథకం ద్వారా డిగ్రీ కోర్సులలో చేరే విద్యార్థినుల సంఖ్య 27 శాతం పెరిగిందని, ఇక పట్ఠాబిరామ్‌ హిందూ కళాశాలకు తాను రెండో పర్యాయం విచ్చేసినట్లు తెలుపటంతో ఎంతో సతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 33 యేళ్ళ క్రితం ఈ కళాశాలను సందర్శించటం తనకింకా గుర్తుందన్నారు. దాతృత్వానికి, విద్యాదానానికి మారుపేరైన కలవల కన్నన్‌శెట్టి హిందూ కళాశాలలో రెండో దశ పుదుమైపెణ్‌ పథకాన్ని ప్రారంభించడం సమంజసంగా ఉందన్నారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడల్లా మహిళలు చాలా సంతోషంగా ఉంటారని, వారికి అమలు చేసిన పథకాలే అందుకు సాక్ష్యమని చెప్పారు. మహిళలు విద్యావంతులైతే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించి వారికి అన్ని సదుపాయాలు కల్పించడం ద్రావిడ తరహా పాలనలో అంతర్భాగమని స్టాలిన్‌ సభికుల హర్షధ్వానాల నడుమ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్ముడి, నాజర్‌, గీతాజీవన్‌, శాసనసభ్యులు ఎ. కృష్ణసామి. దురై చంద్రశేఖర్‌, సామాజిక సంక్షేమ శాఖ సంచాలకులు డి.రత్న, తిరువళ్లూ జిల్లా కలెక్టర్‌ ఆల్పీ జాన్‌ వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: అన్ని రాష్ట్రాలు కోరితే ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధం

Updated Date - 2023-02-09T08:30:51+05:30 IST