heart attack: గుండెపోటుతో ప్రముఖ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ మృతి

ABN , First Publish Date - 2023-06-07T23:01:14+05:30 IST

ప్రముఖ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ (cardiologist Gaurav Gandhi) గుండెపోటుతో మరణించారు.

heart attack: గుండెపోటుతో ప్రముఖ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ మృతి

జామ్‌నగర్‌: ప్రముఖ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ (cardiologist Gaurav Gandhi) గుండెపోటుతో మరణించారు. గుజరాత్‌ (Gujarat ) రాష్ట్రంలో జామ్‌నగర్‌కు చెందిన డాక్టర్ గౌరవ్ గాంధీ మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు నివేదికలో వెల్లడైంది. వైద్య వృత్తిలో 16,000 మందికి పైగా డాక్టర్ గాంధీ శస్త్రచికిత్స చేసినట్లు నివేదిక పేర్కొంది.

సోమవారం డాక్టర్ గాంధీ ఎప్పటిలాగే రోగులను కలుసుకున్నారని, ఆ రాత్రి నగరంలోని ప్యాలెస్ రోడ్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చారని, అనంతరం ఎలాంటి ఫిర్యాదులు, ప్రవర్తనలో మార్పులు లేకుండా భోజనం చేసి పడుకున్నాడని కుటుంబ సభ్యులు చెప్పినట్లు నివేదికలో తెలిసింది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కుటుంబ సభ్యులు అతన్ని లేపేందుకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుర్తించి ఆస్పత్రికి తరలించారని, డాక్టర్ గాంధీ ఆసుపత్రిలో మరణించినట్లు తెలిసింది.

డాక్టర్ గాంధీ జామ్‌నగర్‌లో ప్రాథమిక వైద్య డిగ్రీని పూర్తి చేసి, అహ్మదాబాద్‌లో కార్డియాలజీలో స్పెషలైజేషన్ పూర్తి చేసి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయడానికి తన స్వగ్రామానికి తిరిగి వచ్చారని రిపోర్ట్స్ వెల్లడించాయి.

Updated Date - 2023-06-07T23:06:12+05:30 IST