Bumper offer: ఎన్నికల్లో మాజీ సీఎం పోటీ చేస్తే.. ఖర్చులకు రూ. కోటి ఇస్తా

ABN , First Publish Date - 2023-02-10T12:36:48+05:30 IST

ప్రతిపక్షనేత సిద్దరామయ్య ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది స్పష్టత లేక పోగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల నజరానాలు సంచనలం రేకెత్తిస్తున్నాయి. యాదగిరి

Bumper offer: ఎన్నికల్లో మాజీ సీఎం పోటీ చేస్తే.. ఖర్చులకు రూ. కోటి ఇస్తా

- బీజేపీ నాయకుడి ఆఫర్‌

బెంగళూరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షనేత సిద్దరామయ్య ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది స్పష్టత లేక పోగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల నజరానాలు సంచనలం రేకెత్తిస్తున్నాయి. యాదగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్దరామయ్య(Siddaramaiah) వస్తే ఏకంగా కోటి రూపాయలు ఇస్తానంటూ బీజేపీ ముఖ్యనాయకుడు సంచలన ప్రకటన చేశారు. గురువారం యాదగిరిలో ఆయన కోటి రూపాయల చెక్కుతో పాటు మీడియా ముందుకు వచ్చారు. బీజేపీ నాయకుడు చంద్రాయ కొంకల్‌(BJP leader Chandraya Konkal) మీడియాతో మాట్లాడుతూ... యాదగిరి(Yadagiri) బాగా వెనుకబడిందని ఇక్కడి ప్రజలకు కనీస సౌలభ్యాలు లభించడం లేదన్నారు. సిద్దరామయ్య పోటీ చేస్తే జిల్లా రూపురేఖలే మారిపోతాయనే ఆఫర్‌ ఇచ్చానన్నారు. సిద్దరామయ్యకు కోటి రూపాయలు ఇచ్చే విషయంలో ఎటువంటి తేడా లేదన్నారు. భార్యా పిల్లలతోను చర్చించాకనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ ఆసుపత్రి ఉన్నా వైద్యులు లేరన్నారు. ఇతరత్రా సమస్యలు దశాబ్దాలుగా సాధ్యం కావడం లేదన్నారు. బీజేపీకి చెందిన స్థాని క నేతలతో పనులు సాగడం లేదన్నారు. వయస్సు పైబడిందనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని కానీ సిద్దరామయ్య పోటీ చేస్తే కోటి ఇవ్వకుంటే విమర్శలు చేయాలంటూ సవాల్‌ విసిరారు.

ఇవికూడా చదవండి: మధురై వైపు వెళ్లే పలు రైళ్ల రద్దు

Updated Date - 2023-02-10T12:36:51+05:30 IST