Cancellation of trains: మధురై వైపు వెళ్లే పలు రైళ్ల రద్దు
ABN , First Publish Date - 2023-02-10T10:53:58+05:30 IST
మదురై - తిరుప్పరకుండ్రం-తిరుమంగళం మార్గంలో డబ్లింగ్ పనులు కారణంగా ఆ మార్గంలో వెళ్లే కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు
చెన్నై, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):
మదురై - తిరుప్పరకుండ్రం-తిరుమంగళం మార్గంలో డబ్లింగ్ పనులు కారణంగా ఆ మార్గంలో వెళ్లే కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. ఇంకొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. వివరాలిలా వున్నాయి...
పూర్తిగా రద్దయిన రైళ్లు
- ఈ నెల 16, 18, 23, 25 తేదీల్లో రాత్రి 8.50 గంటలకు మదురై నుంచి ఎగ్మూరు రావాల్సిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22624)
- ఈ నెల 17, 19, 24, 26 తేదీల్లో రాత్రి 10.05 గంటలకు ఎగ్మూరు నుంచి మదురై వెళ్లాల్సిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22623)
- ఈ నెల 16, 17, 20, 21, 23, 24, 27, 28 తేదీల్లో సాయంత్రం 3.45 గంటలకు ఎగ్మూరు నుంచి కారైక్కుడికి బయలుదేరాల్సిన పల్లవన్ ఎక్స్‌ప్రెస్ (12605)
- ఈ నెల 17, 18, 21, 22, 24, 25, 28 తేదీల్లో ఉదయం 5.35 గంటలకు కారైక్కుడి నుంచి ఎగ్మూర్ బయలుదేరాల్సిన పల్లవన్ ఎక్స్‌ప్రెస్ (12606)
- ఈ నెల 16, 17, 19, 23, 24, 26 తేదీల్లో సాయంత్రం 4.20 గంటలకు రామేశ్వరం నుంచి తిరుపతికి బయలుదేరాల్సిన ఎక్స్‌ప్రెస్ (16780)
- ఈ నెల 17, 18, 20, 25, 27 తేదీల్లో ఉదయం 11.55 గంటలకు తిరుపతి నుంచి రామేశ్వరానికి బయలుదేరాల్సిన ఎక్స్‌ప్రెస్ (16779)
- ఈ నెల 22, 24, 27 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి మదురై బయలుదేరాల్సిన సూపర్‌ఫాస్ట్ (20601)
- ఈ నెల 23, 26, 28 తేదీల్లో రాత్రి 10.50 గంటలకు మదురై నుంచి చెన్నై సెంట్రల్ రావాల్సిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20602)
- ఈ నెల 26న పుదుచ్చేరి నుంచి కన్నియాకుమారికి బయలుదేరాల్సిన ఎక్స్‌ప్రెస్ (16861)
- ఈ నెల 27న కన్నియాకుమారి నుంచి పుదుచ్చేరికి బయలుదేరాల్సిన ఎక్స్‌ప్రెస్ (16862)
- ఈ నెల 27వ తేదీ రాత్రి 7,.30 గంటలకు తాంబరం నుంచి నాగర్‌కోయిల్ బయలుదేరాల్సిన సూపర్‌ఫాస్ట్ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (22657)
- ఈ నెల 28వ తేదీన సాయంత్రం 4.15 గంటలకు నాగర్‌కోయిల్ నుంచి తాంబరం బయలుదేరాల్సిన సూపర్‌ఫాస్ట్ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (22658)
పాక్షికంగా రద్దయిన రైళ్లు...
మదురై వైపు వెళ్లాల్సిన కొన్ని రైళ్లు తిరుచ్చి వరకే వెళ్లనున్నాయి. అదే విధంగా మదురై నుంచి బయలుదేరాల్సిన రైళ్లు వివిధ ప్రాంతాల నుంచి కదలనున్నాయి. ఆ వివరాలిలా వున్నాయి...
- ఈ నెల 10, 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28 తేదీల్లో ఉదయం 6 గంటలకు ఎగ్మూరు నుంచి మదురైకి బయలుదేరే తేజస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22671) తిరుచ్చి వరకే వెళ్లనుంది.
- ఈ నెల 10, 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28 తేదీల్లో సాయంత్రం 3 గంటలకు మదురైలో బయలుదేరాల్సిన తేజస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. సాయంత్రం 5.05 గంటలకు తిరుచ్చి నుంచి బయలుదేరనుంది.
- ఈ నెల 11, 18, 25 తేదీల్లో ఉదయం 6.05 గంటలకు కాచిగూడ నుంచి మదురై బయలుదేరే ఎక్స్‌ప్రెస్ (17615) దిండుగల్ వరకే వెళ్లనుంది.
- ఈ నెల 12, 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 1.15 గంటలకు మదురై నుంచి కాచిగూడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ (17616).. మధ్యాహ్నం 2.10 గంటలకు దిండుగల్ నుంచి బయలుదేరుతుంది.
- ఈ నెల 12, 19, 26 తేదీల్లో బెనారస్- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ (22536) విలల్లుపురం వరకే నడుస్తుంది.
- ఈ నెల 15, 22, రాత్రి 11.55 గంటలకు బయలుదేరాల్సిన రామేశ్వరం - బెనార్‌స ఎక్స్‌ప్రెస్ (22535) మరుసటిరోజు ఉదయం 10.20 గంటలకు విల్లుపురం నుంచి బయలుదేరనుంది.
- ఈ నెల 16, 17, 18, 19, 21, 22, 23, 24, 25, 26, 27, 28 తేదీల్లో మధ్యాహ్నం 1.50 గంటలకు ఎగ్మూరు నుంచి మదురై బయలుదేరే వైగై ఎక్స్‌ప్రెస్ (12635) కూడల్‌నగర్ వరకే వెళ్లనుంది.
- ఈ నెల 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 తేదీల్లో ఉదయం 7.10 గంటలకు మదురై నుంచి ఎగ్మూరుకు బయలుదేరాల్సిన వైగై ఎక్స్‌ప్రెస్ (12636).. ఉదయం 7.15 గంటలకు కూడల్‌నగర్ నుంచి బయలుదేరనుంది.
- ఈ నెల 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, తేదీల్లో రాత్రి 9.40 గంటలకు ఎగ్మూరు నుంచి బయలుదేరే పాండ్యన్ ఎక్స్‌ప్రెస్ (12637) కూడల్‌నగర్ వరకే వెళ్లనుంది.
- ఈ నెల 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 తేదీల్లో రాత్రి 9.35 గంటలకు మదురై నుంచి ఎగ్మూరుకు బయలుదేరాల్సిన పాండ్యన్ ఎక్స్‌ప్రెస్ (12638).. 9.40 గంటలకు కూడల్ నగర్ నుంచి బయలుదేరనుంది.
- ఈ నెల 14, 16, 21, 23 తేదీల్లో ఉదయం 5.20 గంటలకు బయలుదేరే హజ్రత్ నిజాముద్దీన్ - మదురై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12652) విల్లుపురం వరకే వెళ్లనుంది.
- ఈ నెల 19, 21, 26, 28 తేదీల్లో అర్ధరాత్రి 12.55 మదురై నుంచి బయలుదేరాల్సిన హజ్రత్ నిజాముద్దీన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12651) ఆ మరునాడు వేకువజామున 5.45 గంటలకు విల్లుపురం నుంచి వెళ్తుంది.
- ఈ నెల 18, 25 తేదీల్లో అజ్మీర్- రామేశ్వరం హంసఫర్ ఎక్స్‌ప్రెస్ (20973) విల్లుపురం వరకే వెళ్లనుంది.
- ఈ నెల 21, 28 తేదీల్లో రామేశ్వరం-అజ్మీర్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ (20974) మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు విల్లుపురం నుంచి బయలుదేరనుంది.
దారి మళ్లించిన రైళ్లు....
- ఈ నెల 9 - 27 తేదీల్లో రాత్రి 1.15 గంటలకు గురువాయూర్ నుంచి ఎగ్మూరు రావాల్సిన ఎక్స్‌ప్రెస్ (16128)ను విరుదునగర్, మానామదురై, కారైక్కుడి, తిరుచ్చి మీదుగా మళ్లించారు. ఈ రైలు మదురై, షోళవందాన్, దిండుగల్, మనప్పారై స్టేషన్లకు వెళ్లదు. బదులుగా మానామదురై, శివగంగ, కారైక్కుడి, పుదుకోట స్టేషన్లలో ఆగనుంది.
- ఈ నెల 11, 18, 25 తేదీల్లో ఉదయం 5.50 గంటలకు కన్నియాకుమారి నుంచి హౌరా బయలుదేరే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12666)ను విరుదునగర్, మానామదురై, కారైక్కుడి, తిరుచ్చి మీదుగా దారి మళ్లించారు. ఈ రైలు మదురై, దిండుగల్ స్టేషన్లకు వెళ్లదు. దానికిన బదులు ఈ రైలు మానామదురై స్టేషన్‌లో ఆగనుంది.
- ఈ నెల 23, 24, 25, 26, 27, 28 తేదీల్లో సాయంత్రం 6.20 గంటలకు సెంగోట్టై నుంచి ఎగ్మూరుకు రావాల్సిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12662)ను విరుదునగర్, మానామదురై, కారైక్కుడి మీదుగా దారి మళ్లించారు. ఈ రైలు మానామదురైలో అదనంగా ఆగుతుంది.
- ఈ నెల 23, 24, 25, 26, 27, 28 తేదీల్లో రాత్రి 7.10 గంటలకు తిరుచ్చెందూర్ నుంచి ఎగ్మూరుకు బయలుదేరే ఎక్స్‌ప్రెస్ (16106) విరుదునగర్, మానామదురై, కారైక్కుడి మీదుగా దారి మళ్లించారు. ఈ రైలు మానామదురైలో అదనంగా ఆగనుంది.
ఇదికూడా చదవండి: వివేకానంద రాక్-తిరువళ్లువర్ విగ్రహం మధ్య రూ. 37 కోట్లతో ఫైబర్‌గ్లాస్ వంతెన