BJP MLA: మళ్లీ.. చిక్కుల్లో పడిన బీజేపీ ఎమ్మెల్యే.. ఆ చిక్కులు ఏంటో తెలిస్తే...
ABN , First Publish Date - 2023-03-15T13:20:40+05:30 IST
కేఎస్డీఎల్ కుంభకోణంలో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన బీజేపీ ఎమ్మెల్యే మాడాళ్ విరూపాక్షప్ప(BJP MLA Madal Virupaks
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కేఎస్డీఎల్ కుంభకోణంలో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన బీజేపీ ఎమ్మెల్యే మాడాళ్ విరూపాక్షప్ప(BJP MLA Madal Virupakshappa) మళ్లీ చిక్కుల్లో పడ్డారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటెర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్డీఎల్) కుంభకోణంలో భారీగా ముడుపులు పొందారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని కర్ణాటక(Karnataka) లోకాయుక్త సుప్రీంకోర్టులో మంగళవారం సవాల్ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం లోకాయుక్త పిటీషన్‌పై విచారణకు అంగీకరించింది. హైకోర్టు ఆదేశాల మేరకు బీజేపీ ఎమ్మెల్యే ఇప్పటికే లోకాయుక్త ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గంటలకొద్దీ ఆయనను లోకాయుక్త ప్రశ్నించినట్టు తెలుస్తోంది. లంచానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు దొరకడంతోనే ఈ వ్యవహారంలో మరింత ముందుకు వెళ్లాలని లోకాయుక్త భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. బీజేపీ ఎమ్మెల్యే మాడాళ్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ రూ.40లక్షల లంచం తీసుకుంటుండగా ఈనెల 2న లోకాయుక్త పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి పట్టుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నివాసాల్లోనూ లోకాయుక్త పోలీసులు సోదాలు జరపగా రూ.8.23 కోట్ల మేరకు నగదు లభించిన సంగతి విదితమే. మొత్తానికి ఈ వ్యవహారం బీజేపీ ఎమ్మెల్యేను మరింత చిక్కుల్లో పడేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.