Arjun Ram Meghwal: మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ క్రెడిట్ బీజేపీదే..

ABN , First Publish Date - 2023-09-20T17:33:20+05:30 IST

మహిళా సాధాకారతకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ సానుకూలమేనని, పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించిన దేశంలోని తొలి పార్టీ బీజేపీయేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పార్టీలో మహిళలకు 33 శాతం పదవులు ఇచ్చేందుకు వడోదర జాతీయ సదస్సుల్లో బీజేపీ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Arjun Ram Meghwal: మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ క్రెడిట్ బీజేపీదే..

న్యూఢిల్లీ: మహిళా సాధాకారతకు భారతీయ జనతా పార్టీ (BJP) ఎప్పుడూ సానుకూలమేనని, పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించిన దేశంలోని తొలి పార్టీ బీజేపీయేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) అన్నారు. పార్టీలో మహిళలకు 33 శాతం పదవులు ఇచ్చేందుకు వడోదర జాతీయ సదస్సుల్లో బీజేపీ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక్కసారి కూడా లోక్‌సభలో చర్చకు రాలేదని సోషల్ మీడియా పోస్ట్‌లో ఆయన తెలిపారు.


బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బిల్లును లోక్‌సభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని, అయితే కాంగ్రెస్ మాత్రం అధికారాన్ని ఎంజాయ్ చేసిందే కానీ, బిల్లును ఎప్పుడూ సభ ముందుకు తీసుకురాలేదని మంత్రి చెప్పారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు 'నారీ శక్తి వందన్' బిల్లు ఒక కీలకమైన ముందడుగు అని ఆయన అభివర్ణించారు. ఈ బిల్లు మహిళలకు సమాన అవకాశాలతో పాటు వారి గౌరవాన్ని ఇనుమడింపజేస్తుందని, మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్పారు.

Updated Date - 2023-09-20T17:33:20+05:30 IST