Germany : బెర్లిన్‌లో మహాత్మా గాంధీ ఫొటోతో నిరసనలు

ABN , First Publish Date - 2023-02-26T13:35:07+05:30 IST

నటుడు, నిర్మాత అర్ఫి లాంబా (Arfi Laamba) ఆదివారం ఆసక్తికర ట్వీట్ చేశారు. భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామానికి అహింసా విధానంలో

Germany : బెర్లిన్‌లో మహాత్మా గాంధీ ఫొటోతో నిరసనలు

న్యూఢిల్లీ : నటుడు, నిర్మాత అర్ఫి లాంబా (Arfi Laamba) ఆదివారం ఆసక్తికర ట్వీట్ చేశారు. భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామానికి అహింసా విధానంలో నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ (Mahatma Gandhi) ఫొటోతో కొందరు నిరసనకారులు బెర్లిన్ వీథుల్లోకి వచ్చారని పేర్కొన్నారు. వీరంతా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. శాంతి నెలకొనాలనే ఆకాంక్షతో వీరు మహాత్మా గాంధీ ఫొటోను చేబూనారని తెలిపారు. గాంధీజీని వీరు తమ హృదయాల్లో, చేతుల్లో నిలుపుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రముఖ పాత్రికేయుడు, యాక్టివిస్ట్, రచయిత ఆకార్ పటేల్ (Aakar Patel) ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2.0 ఫొటోను కూడా పట్టుకోవచ్చునని పేర్కొన్నారు.

ఇదిలావుండగా, విదేశీ మీడియా కథనాల ప్రకారం, ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలను జర్మనీ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 13,000 మంది నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుధాలు అందజేయడానికి బదులుగా రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో చర్చలకు మార్గం సుగమం చేయాలని నిరసనకారులు కోరారు. లింక్స్ పార్టీ రెనెగేడ్ సభ్యుడు సహ్రా వగెన్క్‌నెక్ట్, వెటరన్ ఫెమినిస్ట్ కాంపెయినర్ అలిస్ ష్వార్జర్ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద జరిగినట్లు తెలుస్తోంది. జర్మనీలోని ఇతర నగరాల్లో కూడా ఇటువంటి నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

Maharashtra : మహారాష్ట్రలో రెండు శాసన సభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Jammu and Kashmir : పుల్వామాలో టార్గెట్ కిల్లింగ్... కశ్మీరీ పండిట్ హత్య...

Updated Date - 2023-02-26T13:38:54+05:30 IST