Share News

Bengaluru: వీరి కలయిక వెనుక ఉన్న మతలబు ఏమిటో.. సీఎం సిద్దూతో మాజీసీఎం తనయుడి భేటీ..

ABN , First Publish Date - 2023-11-16T12:19:50+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప(Former Chief Minister BS Yeddyurappa) తనయుడు బీవై విజయేంద్ర

Bengaluru: వీరి కలయిక వెనుక ఉన్న మతలబు ఏమిటో.. సీఎం సిద్దూతో మాజీసీఎం తనయుడి భేటీ..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప(Former Chief Minister BS Yeddyurappa) తనయుడు బీవై విజయేంద్ర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రోజే మరో కుమారుడు, లోక్‌సభ సభ్యుడు బీవై రాఘవేంద్ర(B. Y. Raghavendra) ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కుతూహలం రేకెత్తిస్తోంది. ఇది కాకతాళీయమని, సీఎంకు దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు కావేరి నివాసానికి రాఘవేంద్ర వెళ్లారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా తన నివాసానికి వచ్చిన యడియూరప్ప తనయుడు ఎంపీ రాఘవేంద్రను ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఆయనతో కొద్దిసేపు మాటామంతీ జరిపారు.

pandu2.2.jpg

Updated Date - 2023-11-16T12:19:52+05:30 IST