BBC : మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదం... వివేక్ అగ్నిహోత్రి ఆగ్రహం...

ABN , First Publish Date - 2023-01-20T20:34:46+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై బీబీసీ ప్రసారం చేస్తున్న ఓ డాక్యుమెంటరీపై తీవ్ర వివాదం జరుగుతున్న నేపథ్యంలో

BBC : మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదం... వివేక్ అగ్నిహోత్రి ఆగ్రహం...
Vivek Agnihotri

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై బీబీసీ ప్రసారం చేస్తున్న ఓ డాక్యుమెంటరీపై తీవ్ర వివాదం జరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ ఫిలిం మేకర్ వివేక్ అగ్నిహోత్రి శుక్రవారం ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రజలను విభజించే సిద్ధాంతాన్నే బ్రిటన్ ఎల్లప్పుడూ విశ్వసిస్తుందన్నారు. భారత దేశం ప్రజలను ఏకం చేయాలనే సిద్ధాంతాన్ని నమ్ముతుందన్నారు. బ్రిటిషర్లు మళ్లీ అదే పనిలో ఉన్నందువల్ల తాను బ్రిటన్ పార్లమెంటులో గతంలో చెప్పిన మాటలను మళ్లీ వినాలని కోరారు. హౌస్ ఆఫ్ లార్డ్స్ రిసెప్షన్‌లో గత వేసవి కాలంలో తాను చేసిన ప్రసంగాన్ని వినాలని కోరారు. ఈ ట్వీట్‌కు ఆ వీడియోను జత చేశారు.

రెండు భాగాలుగా ఈ డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేస్తోంది. మొదటి భాగం మంగళవారం ప్రసారమైంది, రెండో భాగాన్ని ఈ నెల 24న ప్రసారం చేయబోతున్నట్లు ప్రకటించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, ఇది కేవలం తప్పుదోవ పట్టించే ప్రచారాస్త్రమని తెలిపింది. అడ్వకేట్ వినీత్ జిందాల్ బీబీసీపై ఫిర్యాదు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపైనా, భారత దేశ సమగ్రతపైనా దాడి చేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2023-01-20T20:34:51+05:30 IST