Income Tax Returns : పొరపాటును అంగీకరించిన బీబీసీ.. రూ.40 కోట్లు తక్కువ ఆదాయం చూపించినట్లు వెల్లడి..

ABN , First Publish Date - 2023-06-06T14:29:01+05:30 IST

బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) సంచలన ప్రకటన చేసింది. వాస్తవంగా చెల్లించవలసినదాని కన్నా తక్కువ పన్ను చెల్లించినట్లు అంగీకరించింది.

Income Tax Returns : పొరపాటును అంగీకరించిన బీబీసీ..  రూ.40 కోట్లు తక్కువ ఆదాయం చూపించినట్లు వెల్లడి..

న్యూఢిల్లీ : బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) సంచలన ప్రకటన చేసింది. వాస్తవంగా చెల్లించవలసినదాని కన్నా తక్కువ పన్ను చెల్లించినట్లు అంగీకరించింది. పొరపాటు జరిగినట్లు అంగీకరించిన నేపథ్యంలో ఈ సంస్థ రివైజ్డ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా బాకీలతోపాటు జరిమానా, వడ్డీ కూడా భారత ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. కొద్ది నెలల క్రితం ఆదాయపు పన్ను శాఖ అధికారులు బీబీసీ న్యూఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, బ్రిటిష్ ప్రభుత్వ నిధులతో పని చేస్తున్న బీబీసీ ఇటీవల కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT)కు ఓ ఈ-మెయిల్‌ను పంపినట్లు తెలుస్తోంది. పన్ను రిటర్నులలో ఆదాయం రూ.40 కోట్లు తక్కువగా చూపినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఐటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బీబీసీ పన్ను ఎగవేతకు సంబంధించిన విధివిధానాలను పాటించవలసి ఉంది. చట్ట ప్రకారం నిర్దేశించిన విధానాలను బీబీసీ పాటించాలి, లేదా, చట్ట ప్రకారం చర్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. సమంజసమైన ముగింపు వచ్చే వరకు ఐటీ శాఖ చర్యలు కొనసాగుతాయి.

బీబీసీ పన్నుల ఎగవేతకు పాల్పడుతోందనే ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ ఫిబ్రవరిలో బీబీసీ న్యూఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ‘‘ఇండియా : ది మోదీ క్వశ్చన్’’ అనే డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన నేపథ్యంలో ఈ సర్వే జరిగింది.

ఇవి కూడా చదవండి :

Odisha train accident: 48 గంటల తర్వాత సజీవంగా కనిపించిన వ్యక్తి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..

America : భారత్ శక్తిమంతమైన, జీవచైతన్యంగల ప్రజాస్వామిక దేశం : అమెరికా

Updated Date - 2023-06-06T14:29:01+05:30 IST