Ratha Yatra: జగన్నాథ రథయాత్ర జరుగుతుండగా కుప్పకూలిన బాల్కనీ..

ABN , First Publish Date - 2023-06-20T18:35:37+05:30 IST

అహ్మదాబాద్‌ లోని దరియాపూర్ ప్రాంతంలో మంగళవారంనాడు జగన్నాథ రథయాత్ర సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. రథయాత్ర ముందుకు సాగుతుండగా ఓ భవంతి మూడో అంతస్తు బాల్కనీ కుప్పకూలడంతో 11 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

Ratha Yatra: జగన్నాథ రథయాత్ర జరుగుతుండగా కుప్పకూలిన బాల్కనీ..

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌ (Ahmedabad) లోని దరియాపూర్ ప్రాంతంలో మంగళవారంనాడు జగన్నాథ రథయాత్ర (Jagannatha Radha Yatra) సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. రథయాత్ర ముందుకు సాగుతుండగా ఓ భవంతి మూడో అంతస్తు బాల్కనీ కుప్పకూలడంతో 11 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

అహ్మదాబాద్‌లోని జగన్నాథుని 146వ రథయాత్ర ఉదయం ఎంతో అట్టహాసంగా మొదలైంది. పోలీసులు తొలిసారి 3డి మేపింగ్ టెక్నాలజీ ద్వారా రథయాత్ర మార్గాన్ని మానిటర్ చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఉదయమే సంప్రదాయబద్ధంగా బంగారు చీపురుతో రథాలు వెళ్లే మార్గాన్ని శుభ్రం చేశారు. అనంతరం జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర రథాలలో బయలుదేరారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సైతం తెల్లవారుజామున మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ భద్రత, సుమారు డజను ఏనుగులు, ఒంటెలు, అలంకరించిన శకటాలతో ఊరేగింపు మొదలైంది. మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో సీఐఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారు.

నిష్పాక్షిక దర్యాప్తు జరపాలన్న కాంగ్రెస్

కాగా, రథయాత్ర జరుగుతుండగా బాల్కనీ కుప్పకూలి పలువురు గాయపడిన ఘటనపై కాంగ్రెస్ నేత మోద్వాడియా విచారం వ్యక్తం చేశారు. ఘటనకు నిర్లక్ష్యం కారణమైతే దానిపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని అన్నారు. క్షతగాత్రులు త్వరలో కోలుకోవాలని అభిలషించారు.

Updated Date - 2023-06-20T18:38:15+05:30 IST