Assam: 18 ఏళ్లు నిండకముందే బాలికలు గర్భం దాలిస్తే భర్తలపై పోక్సో కేసులు

ABN , First Publish Date - 2023-02-03T08:44:52+05:30 IST

18 ఏళ్లు నిండకుండానే బాలికలు గర్భం దాల్చడానికి కారణమైన భర్తలందరిపై పోక్సో చట్టం కింద కేసులు పెట్టాలని...

Assam: 18 ఏళ్లు నిండకముందే బాలికలు గర్భం దాలిస్తే భర్తలపై పోక్సో కేసులు
Crackdown on Child Marriages

గౌహతి : బాల్యవివాహాలపై అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఉక్కుపాదం మోపారు.(Assam Chief Minister Himanta Biswa Sarma) 18 ఏళ్ల వయసు లోపు బాలికలను పెళ్లి చేసుకున్న వారిని అరెస్టు చేస్తామని సీఎం శర్మ హెచ్చరించారు. సీఎం శర్మ ఆదేశంతో అసోంలో 4,004 బాల్య వివాహాల(Child Marriages) కేసులు నమోదు చేశామని అసోం ఫైర్ బ్రాండ్ నాయకుడైన సీఎం శర్మ చెప్పారు. నాగావ్, మోరిగావ్ జిల్లాల్లో బాల్యవివాహాలు చేసుకున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: Yogi Adityanath: ఆందోళన చెందవద్దు... జనతా దర్శన్‌లో ప్రజలకు సీఎం అభయం

‘‘అసోంలో రాష్ట్రంలో బాల్యవివాహాలను నిరోధించేందుకు అసోం సర్కారు ధృడ చిత్తంతో పనిచేస్తోంది. బాల్యవివాహాలు చేసుకున్న వారిపై శుక్రవారం నుంచి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’’ అని సీఎం హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేస్తూ పోలీసుల నివేదికను పంచుకున్నారు. బాల్య వివాహాలపై రాష్ట్ర వ్యాప్త పోలీసు చర్యలకు ముందు ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి పోలీసు అధికారుల సమావేశంలో సమీక్షించారు. రాష్ట్రంలోని బాల్యవివాహాల నుంచి బయటపడటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో ప్రజలు సహకరించాలని సీఎం శర్మ విజ్ఞప్తి చేశారు. ధుబ్రి జిల్లాలో అత్యధికంగా 370 బాల్యవివాహాల కేసులు నమోదయ్యాయి. తరువాతి స్థానాల్లో హోజాయ్ జిల్లాలో 255కేసులు, ఉదల్గురి జిల్లాలో 235కేసులు నమోదైనాయి. గౌహతి పోలీస్ కమిషనరేట్‌లో 192 కేసులు నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి : Miss Russia:మిస్ యూనివర్స్ పోటీలో నుంచి తొలగించారు...రష్యా మిస్ అన్నా లిన్నికోవా సంచలన వ్యాఖ్యలు

14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం నేరమని సీఎం చెప్పారు. రాబోయే ఆరు నెలల్లో బాల్యవివాహాలు చేసుకున్న వేలాది మంది భర్తలను అరెస్టు చేస్తామని సీఎం శర్మ హెచ్చరించారు.బాల్యవివాహాలు,బాలికలపై లైంగిక నేరాల నిరోధానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సీఎం పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండకుండానే బాలికలు(Girl pregnant) గర్భం దాల్చడానికి కారణమైన భర్తలందరిపై పోక్సో చట్టం కింద కేసులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.మహిళల వివాహానికి చట్టబద్ధమైన వయస్సు 18 సంవత్సరాలని, చిన్న అమ్మాయిలను వివాహం చేసుకునే వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు చట్టం తీసుకురానున్నట్లు అసోం ముఖ్యమంత్రి శర్మ వివరించారు.

Updated Date - 2023-02-03T08:44:55+05:30 IST