Law Ministry Changes: మరో దిద్దుబాటు చర్య.. ఎస్పీ సింగ్ బఘెల్‌ ఔట్

ABN , First Publish Date - 2023-05-18T19:42:51+05:30 IST

ప్రధాని మోదీ కేబినెట్‌లో దిద్దుబాటు చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రుల్లో మరొకరి శాఖను మారుస్తూ మోదీ సర్కార్..

Law Ministry Changes: మరో దిద్దుబాటు చర్య.. ఎస్పీ సింగ్ బఘెల్‌ ఔట్

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ (PM Narendra Modi) కేబినెట్‌లో దిద్దుబాటు చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రుల్లో మరొకరి శాఖను మారుస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.ఎస్పీ సింగ్ బఘేల్‌(SP Singh Baghel)ను కేంద్ర న్యాయశాఖ (Minister of State for Law and Justice) నుంచి తొలగించారు. ఎస్పీ సింగ్ బఘేల్‌కు ఆరోగ్యశాఖ సహాయ మంత్రి శాఖ(Ministry of Health and Family Welfare)ను అప్పగిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

కాగా కొద్ది గంటలముందే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు(Kiren Rijiju)ను తొలగించి ఆయన స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్‌(Arjun Ram Meghwal)కు బాధ్యతలు అప్పగించారు. కిరణ్ రిజుజుకు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ(Ministry of Earth Sciences)ను కేటాయిస్తూ నిర్ణయించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు కేంద్ర కేబినెట్‌లోని మంత్రుల శాఖల్లో మార్పులు చేసినట్లు రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2023-05-18T20:07:53+05:30 IST