Air India Pee Gate: మళ్లీ సేమ్ సీన్.. రూ. 10 లక్షల జరిమానా!

ABN , First Publish Date - 2023-01-24T17:13:29+05:30 IST

ఎయిర్‌ ఇండియా(Air India)ను వివాదాలు వీడడం లేదు. గతేడాది నవంబరులో

Air India Pee Gate: మళ్లీ సేమ్ సీన్.. రూ. 10 లక్షల జరిమానా!

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా(Air India)ను వివాదాలు వీడడం లేదు. గతేడాది నవంబరులో న్యూయార్క్(New York)-న్యూఢిల్లీ(New Delhi) విమానంలో శంకర్ మిశ్రా (Shankar Mishra) అనే వ్యక్తి మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనను మర్చిపోకముందే అలాంటిదే మరో ఘటన జరిగింది. ఈ ఘటనలో ఈసారి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొరడా ఝళిపించింది. ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా విధించింది.

గతేడాది డిసెంబరు 6న పారిస్(Paris)- ఢిల్లీ(Delhi) విమానంలో ఓ వ్యక్తి ఖాళీగా ఉన్న ఓ మహిళ సీటులోని దుప్పటిపై మూత్రవిసర్జన చేశాడు. ఈ విషయాన్ని నివేదించడంలో జాప్యం చేసినందుకు గాను ఎయిర్ ఇండియాపై డీజీసీఏ చర్యలు తీసుకుంది. 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. నవంబరు 26న జరిగిన ఘటన కానీ, డిసెంబరు 6 ఘటన కానీ మీడియాలో వచ్చేంత వరకు ఆ విషయాన్ని ఎయిర్ ఇండియా రెగ్యులేటర్ దృష్టికి తీసుకెళ్లలేదు. డిసెంబరు 6 నాటి ఘటనపై ఎయిర్ ఇండియా వివరణ కోరినట్టు డీజీసీఏ తెలిపింది. తాము నివేదిక అడిగేంత వరకు ఎయిర్ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించలేదని పేర్కొంది.

Updated Date - 2023-01-24T17:16:17+05:30 IST