AAP pan India poster campaign: ‘మోదీ హటావో, దేశ్ బచావో’ ఆప్ పాన్ ఇండియా ప్రచారం ప్రారంభం

ABN , First Publish Date - 2023-03-30T11:13:29+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పాన్ ఇండియా పోస్టర్ ప్రచారం ప్రారంభించింది...

AAP pan India poster campaign: ‘మోదీ హటావో, దేశ్ బచావో’ ఆప్ పాన్ ఇండియా ప్రచారం ప్రారంభం
AAP pan India poster campaign

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పాన్ ఇండియా పోస్టర్ ప్రచారం ప్రారంభించింది.(AAP pan India poster campaign) ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకొని ‘‘మోదీ హటావో, దేశ్ బచావో’’ (Modi Hatao, Desh Bachao)పేరిట ప్రచార పోస్టర్లను దేశవ్యాప్తంగా 11 భాషల్లో ఆప్ ప్రదర్శించింది. ఢిల్లీలో ‘‘క్యా భారత్ కే పీఎం కో పడే లిఖే హోనా చాహియే’’తో పోస్టర్లు వెలిశాయి.ఆప్ మార్చి 30న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పోస్టర్లను ప్రదర్శించింది.గత వారం దేశ రాజధాని నగరం ఢిల్లీ అంతటా గోడలు, విద్యుత్ స్తంభాలపై ‘‘మోదీ హటావో, దేశ్ బచావో’’(మోదీని తొలగించండి, భారతదేశాన్ని రక్షించండి) అని రాసిన పోస్టర్లు కనిపించాయి. ఈ పోస్టర్ల వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి : Toll Tax: ఎల్లుండి నుంచి టోల్ ట్యాక్స్ పెంపు...వాహనచోదకులపై మరింత భారం

దేశ రాజధానిలో ప్రధాని మోదీని తొలగించాలని కోరుతూ వేలాది పోస్టర్లు కనిపించడంతో ఢిల్లీ పోలీసులు 100కి పైగా కేసులు నమోదు చేశారు.ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులపై విమర్శలు సంధించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో తమకు వ్యతిరేకంగా పోస్టర్లు వేసిన వారిని బ్రిటిష్ వారు కూడా అరెస్టు చేయలేదని కేజ్రీవాల్ అన్నారు. బ్రిటీష్ పాలనలో భగత్ సింగ్ చాలా పోస్టర్లు అతికించాడని, అతనిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ అన్నారు. ‘‘కేజ్రీవాల్ హటావో, ఢిల్లీ బచావో’’ (కేజ్రీవాల్‌ను తొలగించండి, ఢిల్లీని రక్షించండి) పోస్టర్‌లను అతికించడం ద్వారా బీజేపీ ప్రతీకారం తీర్చుకుంది.

Updated Date - 2023-03-30T11:13:29+05:30 IST