Fire Accident in Train : టూరిస్ట్ రైలులోని కిచెన్‌లో పేలిన సిలిండర్.. ఆరుగురి మృతి

ABN , First Publish Date - 2023-08-26T08:03:50+05:30 IST

మధురై రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైలులోని కిచెన్‌లో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ప్రాథమిక విచారణలో తేలింది.

Fire Accident in Train : టూరిస్ట్ రైలులోని కిచెన్‌లో పేలిన సిలిండర్.. ఆరుగురి మృతి

మధురై : మధురై రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైలులోని కిచెన్‌లో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదంలో ఆరుగురి మృతి చెందారు. మంటల్లో ఒకరు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. మృతులంతా ఉత్తరప్రదేశ్ వాసులుగా గుర్తించడం జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సప్తమన్ సింగ్ (64), మిథిలేశ్వరి (65) సహా ఆరుగురు వ్యక్తులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

Updated Date - 2023-08-26T08:10:31+05:30 IST