Karnataka: ఎన్నికల సంవత్సరంలో కర్ణాటకకు రూ.5,300కోట్ల కేంద్ర నిధులు

ABN , First Publish Date - 2023-02-01T12:43:28+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి కేంద్రం వరాలిచ్చింది....

Karnataka: ఎన్నికల సంవత్సరంలో కర్ణాటకకు రూ.5,300కోట్ల కేంద్ర నిధులు
Finance Minister Nirmala Sitharaman

న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి కేంద్రం వరాలిచ్చింది.(Karnataka) బుధవారం పార్లమెంటులో నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లో కర్ణాటక రాష్ట్రానికి రూ.5,300 కోట్ల కేంద్ర నిధులు(central aid) కేటాయించింది.కర్ణాటక రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల్లో సాగునీటి సరఫరా(Irrigation) కోసం ఈ నిధులను వెచ్చిస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. 2023-24 కేంద్ర బడ్జెట్ లో కర్ణాటకకు ప్రాధాన్యమిచ్చి నిధులు కేటాయించిన కేంద్రం తెలుగు రాష్ట్రాలను విస్మరించింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు(Election year) జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి కేంద్ర నిధులు కేటాయిస్తున్నట్లు నిర్మలసీతారామన్ ప్రకటించారు.

Updated Date - 2023-02-01T12:43:35+05:30 IST