X: తగ్గుతున్న ఎక్స్ యూజర్లు.. ఆందోళన వ్యక్తం చేసిన సీఈవో

ABN , First Publish Date - 2023-10-01T14:52:15+05:30 IST

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్(X) కి యూజర్లు తగ్గుతున్నారని కంపెనీ సీఈవో లిండా యాకారినో(Linda Yaccarino) తెలిపారు. ఏటా ఈ సంఖ్య పెరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

X: తగ్గుతున్న ఎక్స్ యూజర్లు.. ఆందోళన వ్యక్తం చేసిన సీఈవో

న్యూయార్క్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్(X) కి యూజర్లు తగ్గుతున్నారని కంపెనీ సీఈవో లిండా యాకారినో(Linda Yaccarino) తెలిపారు. ఏటా ఈ సంఖ్య పెరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ ప్రస్తుతం 225 మిలయన్ యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్నారని.. ఎలాన్ మస్క్(Elon Musk) ఎక్స్ ని కొనుగోలు చేయకముందు నుంచి ఇప్పటి వరకు 11.6 శాతం యూజర్లు తగ్గారని ఆమె అన్నారు. గతేడాది ఎలాన్ మస్క్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మైక్రోబ్లాగింగ్ సైట్ తన రోజువారీ యాక్టివ్ యూజర్లను(X Users) కోల్పోతున్నట్లు లిండా వెల్లడించారు.


మస్క్ ఎక్స్ ని టేకోవర్‌కి చేసే వారం ముందు 254.5 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారని.. ప్రస్తుతం ఆ సంఖ్య 245 మిలియన్లకు తగ్గినట్లు వివరించారు. అదే టైంలో ఎక్స్ దాదాపు 15 మిలియన్ యూజర్లను తొలగించడం సైతం యాక్టివ్ యూజర్ల సంఖ్య తగ్గడానికి కారణమని తెలిపారు. ఎక్స్ లో ప్రస్తుతం 50 వేల గ్రూపులో ఉన్నాయని చెప్పారు. 2024లో వారిని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తామని ఆమె తెలిపారు.

Updated Date - 2023-10-01T14:54:37+05:30 IST