Share News

Vladmir Putin: రష్యన్ మహిళలు ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలి: పుతిన్

ABN , Publish Date - Dec 16 , 2023 | 08:11 AM

రష్యాలో జననాల రేటు రోజు రోజుకు తగ్గిపోతుంది. జనాభా శాస్త్రవేత్త విక్టోరియా సాకేవిచ్ ప్రకారం జననాల రేటు తగ్గడం ఆందోళనకు గురి చేస్తోంది. 1990ల నుంచి రష్యాలో అబార్షన్ రేటు దాదాపు పదిరెట్లు పడిపోయింది.

Vladmir Putin: రష్యన్ మహిళలు ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలి: పుతిన్

రష్యాలో జననాల రేటు రోజు రోజుకు తగ్గిపోతుంది. జనాభా శాస్త్రవేత్త విక్టోరియా సాకేవిచ్ ప్రకారం జననాల రేటు తగ్గడం ఆందోళనకు గురి చేస్తోంది. 1990ల నుంచి రష్యాలో అబార్షన్ రేటు దాదాపు పదిరెట్లు పడిపోయింది. సంపూర్ణ అబార్షన్ నిషేధానికి పుతిన్ వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఫలితాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలు 'పిల్లల ప్రాణాలను కాపాడాల్సిన' అవసరాన్ని నొక్కి చెప్పారు. దీంతో ఎలాగైనా జననాల రేటును పెంచాలని భావిస్తున్న రష్యా అధికారులు ప్రభుత్వాస్పుత్రుల్లో మహిళలు గర్భాన్ని తొలగించుకోవడాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. అబార్షన్ల వల్ల జనన రేటు పెరగదని జనాభాను మెరుగుపరచడం తమ లక్ష్యం అని చెబుతున్నారు. ఆర్థడాక్స్ చర్చి అధికారులు కూడా అబార్షన్లను అరికట్టాలని రష్యా అధికారులను కోరుతున్నారు. దేశం యుద్ధంలో ఉన్న సమయంలో అబార్షన్లు సహజమని జార్జియాలో ఉన్న రష్యన్ ఫెమినిస్ట్ కార్యకర్త లెడా గరీబా చెప్పారు. ఇంట్లో కూర్చొని ఎక్కువ మంది సైనికులకు జన్మనివ్వాలని ఆమె రష్యన్ మహిళలకు సందేశం ఇచ్చారు.


మరోవైపు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు తమ పౌరులకు ఆర్థికంగా ప్రోత్సాహకం ఇచ్చేందుకు రష్యా ప్రభుత్వం సిద్ధమైంది. ఉక్రెయిన్‌లో ఉన్న ప్రస్తుత రష్యా దళాలకు అదనపు సైనిక సమీకరణలు అనవసరమని అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఇంకా రిక్రూట్‌మెంట్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, కానీ బుధవారం సాయంత్రం నాటికే రష్యా సైన్యంలో 4,86,000 మంది సైనికులు చేరారని తెలిపారు. అదనంగా ప్రతి రోజూ సైన్యంలో 1500 మంది చేరుతున్నట్టు చెప్పారు. మాస్కో సదస్సులో పుతిన్ మాట్లాడుతూ మహిళలు పెద్ద కుటుంబాలను ఆలింగనం చేసుకోవాలని కోరారు. తగ్గుతున్న జనన రేటును ఎదుర్కోవటానికి ఎనిమిది మంది పిల్లల వరకు కనాలని సూచించారు. బహుళ తరాలకు చెందిన కుటుంబాల చారిత్రక పూర్వాపరాలను ఆయన నొక్కి చెప్పారు. ఆంక్షల కారణంగా తీవ్రమైన శ్రామిక శక్తి కొరత, ఆర్థిక మందగమనానికి దారితీసిన ఉక్రెయిన్ యుద్ధం వల్ల తీవ్రతరం అయిన జనాభాపరమైన సవాళ్లకు ప్రతిస్పందనగా ఈ పిలుపు కనిపిస్తుంది.

Updated Date - Dec 16 , 2023 | 08:11 AM