Human Rights: తాలిబన్ల రాజ్యంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన.. 19 నెలల్లో ఎన్ని కేసులంటే?

ABN , First Publish Date - 2023-09-20T16:50:23+05:30 IST

ఆఫ్గనిస్తాన్(Afghanisthan) దేశాన్ని తాలిబన్లు వశపరుచుకున్న తరువాత అక్కడ మానవ స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారిందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రశ్నించేవారిని అణిచివేయడం.. ఎదురెళ్లినవారిని కాలగర్భంలో కలిపేయడం ఇదే తంతు. ఆ దేశాన్ని తాలిబన్లు(Talibans) పాలించి 19 నెలలు కావస్తుండగా ఇప్పటి వరకు మానవ హక్కుల(Human Rights) ఉల్లంఘనలో ఆ దేశం కొత్త రికార్డులు లిఖిస్తోంది.

Human Rights: తాలిబన్ల రాజ్యంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన.. 19 నెలల్లో ఎన్ని కేసులంటే?

కాబూల్: ఆఫ్గనిస్తాన్(Afghanisthan) దేశాన్ని తాలిబన్లు వశపరుచుకున్న తరువాత అక్కడ మానవ స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారిందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రశ్నించేవారిని అణిచివేయడం.. ఎదురెళ్లినవారిని కాలగర్భంలో కలిపేయడం ఇదే తంతు. ఆ దేశాన్ని తాలిబన్లు(Talibans) పాలించి 19 నెలలు కావస్తుండగా ఇప్పటి వరకు మానవ హక్కుల(Human Rights) ఉల్లంఘనలో ఆ దేశం కొత్త రికార్డులు లిఖిస్తోంది. ఇప్పటి వరకు 1 వేయి 600లకు పైగా మానవ హక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు ఐక్యారాజ్య సమితి(UNO) బుధవారం వెల్లడించింది. వారిలో ఎక్కువగా పోలీసులే ఉన్నారని నివేదికలో పేర్కొంది.


గడిచిన 19 నెలల్లో 18 మంది జైళ్లలో పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది కస్టడీలో మరణించారని UN మిషన్ టు ఆఫ్ఘనిస్తాన్ (UNAMA) స్పష్టం చేసింది. బాధితులకు దెబ్బలు, కరెంట్ షాక్, మానసికంగా హింసించడం, బెదిరింపులు తదితర చిత్రహింసల్ని పెట్టేవారని తెలిపింది. కొన్ని కేసుల్లో హింసకు గురయి ఆసుపత్రిపాలయ్యి సరైన వైద్య చికిత్స అందక ప్రాణాలు విడిచారు. పదిలో ఒక ఉల్లంఘన మహిళపై జరిగినవేనని నివేదిక తేటతెల్లం చేసింది. అక్కడ రోజు రోజుకీ పెరిగిపోతున్న ఆంక్షలు, కఠిన చట్టాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2023-09-20T16:51:25+05:30 IST