Imran khan: ఇమ్రాన్ ఖాన్‌కు స్వల్ప ఉపశమనం...

ABN , First Publish Date - 2023-03-17T18:28:08+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు స్వల్ప ఉపశమనం లభించింది. ఆయనకు..

Imran khan: ఇమ్రాన్ ఖాన్‌కు స్వల్ప ఉపశమనం...

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు స్వల్ప ఉపశమనం లభించింది. ఆయనకు జారీ చేసిన నాన్-బెయిలబుల్ అరెస్టు వారెంట్లను (Arrest Warrants) పాకిస్థాన్ హైకోర్టు (Pakistan High court) ఈనెల 18వ తేదీ వరకూ సస్పెండ్ చేసింది. గత ఏప్రిల్‌లో ప్రధాని పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఇమ్రాన్ ఖాన్ తోషఖానా కేసు, టెర్రరిజం కేసు, మహిళా జడ్జిని బెదిరించిన కేసుతో సహా పలు లీగల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన బహుమతులు చట్టవిరుద్ధంగా అమ్ముకున్నారనే ఆరోపణలపై మార్చి 18వ తేదీన ఇస్లామాబాద్‌ కోర్టుకు ఆయన హాజరుకావలసి ఉంది.

ఇమ్రాన్ ఖాన్‌పై జారీ చేసిన నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్లను శనివారం వరకూ సస్పెండ్ చేసిన ఢిల్లీ హైకోర్టు, ఇదే సమయంలో నాన్‌ బెయిలబుల్ అరెస్టు వారెంట్లను ఎలా అమలు చేసే విషయంపైన, ఇమ్రాన్ ఖాన్ భద్రతపైన పంజాబ్ ఐజీపీ ఉస్మాన్ అన్వర్‌తో పీటీఐ నాయకత్వం మరోసారి సమావేశం కావాలని కూడా ఆదేశించింది. ఇమ్రాన్‌ను అరెస్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకునేందుకు పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ అభిమానులు ఎక్కడికక్కడ సిద్ధం కావడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Updated Date - 2023-03-17T18:28:08+05:30 IST