North Korea: నార్త్ కొరియా మరో రెండు బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం

ABN , First Publish Date - 2023-03-27T07:34:30+05:30 IST

అమెరికా దేశంపై ఒత్తిడి పెంచేందుకు ఉత్తర కొరియా సోమవారం తూర్పు తీరంలోని సముద్ర జలాల వైపు రెండు బాలిస్టిక్ క్షిపణులను...

North Korea: నార్త్ కొరియా మరో రెండు బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం
North Korea fires 2 ballistic missiles

అమెరికా దేశంపై ఒత్తిడి పెంచేందుకు ఉత్తర కొరియా సోమవారం తూర్పు తీరంలోని సముద్ర జలాల వైపు రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.(North Korea) దీంతో ఉత్తర కొరియా ఈ నెలలో ఇప్పటి వరకు ఏడు క్షిపణులను(ballistic missiles) ప్రయోగించింది.యునైటెడ్ స్టేట్స్ దక్షిణ కొరియాతో కలిసి సైనిక కసరత్తులు చేసిన నేపథ్యంలో నార్త్ కొరియా వరుస క్షిపణుల ప్రయోగంతో దూకుడు పెంచింది. యుఎస్-దక్షిణ కొరియా సంయుక్త సైనిక కసరత్తులను దండయాత్ర రిహార్సల్స్‌గా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోపించారు.

ఉత్తర కొరియా ఈ సంవత్సరం 11 ప్రయోగ ఈవెంట్లలో 20 కంటే ఎక్కువ బాలిస్టిక్,క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది.శుక్రవారం ఉత్తర కొరియా డ్రోన్ పరీక్ష చేసిన తరువాత, దక్షిణ కొరియా వైమానిక దళం గత వారం యునైటెడ్ స్టేట్స్‌తో ఐదు రోజుల జాయింట్ ఏరియల్ డ్రిల్ వివరాలను విడుదల చేసింది.ఉత్తర కొరియా ఇప్పటికే ఆయుధ పరీక్షలో రికార్డు సృష్టిస్తోంది. ఉత్తర కొరియా 2022 లో 70 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది.

Updated Date - 2023-03-27T07:34:30+05:30 IST