United Airlines Flight: విమానంలో మంటలు...నలుగురికి అస్వస్థత

ABN , First Publish Date - 2023-02-09T07:28:31+05:30 IST

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ల్యాప్‌టాప్ అగ్నికి ఆహుతైన ఘటన...

United Airlines Flight: విమానంలో మంటలు...నలుగురికి అస్వస్థత
Laptop Catches Fire on Flight

న్యూజెర్సీ: యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ల్యాప్‌టాప్ అగ్నికి ఆహుతైన ఘటన శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.(Laptop Catches Fire) న్యూజెర్సీకి బయలుదేరిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్(United Airlines Flight) విమానంలో ల్యాప్‌టాప్ అగ్నిప్రమాదం జరగడంతో ఆ విమానాన్ని శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.2664 యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం న్యూజెర్సీలోని నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గంలో ప్రయాణికుడి బ్యాటరీ ప్యాక్‌లో మంటలు చెలరేగాయని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. ఈ అగ్నిప్రమాదంతో పొగ పీల్చిన నలుగురు ప్రయాణికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

విమానం ల్యాండింగ్ కాగానే ఫస్ట్ క్లాస్ ప్రయాణీకుడి బ్యాగ్‌లోని ఓ ల్యాప్‌టాప్ నుంచి పొగ వచ్చిందని దీంతో అతను బ్యాటరీ ఛార్జర్ ప్యాక్ ను నేలపై విసిరేశాడని కరోలిన్ లిపిన్స్కి అనే ప్రయాణికురాలు చెప్పారు. విమానం క్యాబినులో పొగ రావడంతో తాను భయపడ్డానని, అంతలో మంటలను ఆర్పే యంత్రాలతో సిబ్బంది రావడంతో ఊపిరి పీల్చుకున్నానని స్టీఫన్ జోన్స్ అనే ప్రయాణికురాలు చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన బోయింగ్ 737 విమానం సురక్షితంగా తిరిగి వచ్చిందని, పొగ పీల్చిన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని శాన్ డియాగో హెల్త్ తెలిపింది.

ఇది కూడా చదవండి : Aaftab Poonawala: శ్రద్ధావాకర్‌ను హత్య చేసిన 5 రోజులకే మరో గాళ్‌ఫ్రెండ్‌తో రాత్రిళ్లు గడిపాడు...

ల్యాప్ టాప్ లో లిథియం అయాన్ బ్యాటరీ వేడెక్కడం వల్ల విమానంలో మంటలు వచ్చాయని విమాన సిబ్బంది చెప్పారు.గత డిసెంబరు నెలలో లాస్ ఏంజిల్స్ నుంచి జర్మనీకి వెళ్లే లుఫ్తాన్సా విమానం ల్యాప్‌టాప్‌లో మంటలు చెలరేగడంతో చికాగోకు మళ్లించారు.డిసెంబరులో బార్బడోస్ నుంచి న్యూయార్క్‌కు వెళుతున్న జెట్‌బ్లూ విమానం బ్యాటరీతో మంటలు చెలరేగడంతో న్యూయార్క్‌లో ఖాళీ చేశామని అధికారులు తెలిపారు. విమానం ఎమర్జెన్సీ స్లైడ్‌ల ద్వారా 160 మంది ప్రయాణికులను ఖాళీ చేయించారు.ఈ ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గత నవంబర్‌లో న్యూయార్క్‌లో లిథియం-అయాన్ ఇ-బైక్ బ్యాటరీలో మంటలు చెలరేగడంతో 36 మందికి పైగా గాయపడ్డారు.

Updated Date - 2023-02-09T09:03:20+05:30 IST