Aaftab Poonawala: శ్రద్ధావాకర్‌ను హత్య చేసిన 5 రోజులకే మరో గాళ్‌ఫ్రెండ్‌తో రాత్రిళ్లు గడిపాడు...

ABN , First Publish Date - 2023-02-08T09:33:58+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ దారుణ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తూనే ఉంది....

Aaftab Poonawala: శ్రద్ధావాకర్‌ను హత్య చేసిన 5 రోజులకే మరో గాళ్‌ఫ్రెండ్‌తో రాత్రిళ్లు గడిపాడు...
Aaftab Poonawala,Shraddha

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ దారుణ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తూనే ఉంది. శ్రద్ధావాకర్ హత్యోదంతంపై(Shraddhas murder) ఢిల్లీ పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి 6,629 పేజీల చార్జ్ షీటును కోర్టులో ప్రవేశపెట్టారు. శ్రద్ధావాకర్ ను హత్యచేసిన ఐదు రోజుల తర్వాత నిందితుడు అఫ్తాబ్ పూనావాలా(Aaftab Poonawala) మరో గాళ్‌ఫ్రెండ్‌ను తన గదికి రప్పించుకున్నాడని వెల్లడైంది. డేటింగ్ యాప్ బంబుల్ ద్వారా పరిచయం అయిన మరో యువతి జూన్ 25వతేదీన ఛతర్ పూర్ ఫ్లాట్ కు వచ్చిందని తేలింది. జూన్ 25వతేదీ తర్వాత కొత్త స్నేహితురాలు(Another Girlfriend) తరచూ ఆఫ్తాబ్ ఫ్లాట్‌కు వచ్చేదని వెల్లడైంది. ఆ అమ్మాయి అఫ్తాబ్ ఫ్లాట్‌లోనే రాత్రివేళల్లో గడిపేదని పోలీసులు సమర్పించిన చార్జిషీట్ వెల్లడించింది.

అమ్మాయి ఫ్లాట్‌కి వచ్చినప్పుడు ఫ్రిజ్‌లో ఉన్న శ్రద్ధా మృతదేహాన్ని బయటకు తీసి కిచెన్‌లోని లోయర్ క్యాబినెట్‌లో పెట్టి ఫ్రిజ్‌ను పూర్తిగా శుభ్రం చేసేవాడని ఆఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు.అమ్మాయి తన ఫ్లాటుకు వచ్చినప్పుడల్లా కోసిన శరీర భాగాలను ఆఫ్తాబ్ ఫ్రిజ్‌లోంచి బయటకు తీసి వంటగదిలో దాచేవాడు. గాళ్ ఫ్రెండ్ నిష్క్రమణ తర్వాత శ్రద్ధావాకర్ తలతో సహా కోసిన శరీర భాగాలను తిరిగి ఫ్రిజ్‌లో ఉంచేవాడు.

ఇది కూడా చదవండి : Sania Mirza: విడాకుల పుకార్లకు ఆజ్యం పోస్తూ సానియామీర్జా ఇన్‌స్టాగ్రాంలో తాజా పోస్ట్

కొత్త స్నేహితురాలు మొదటిసారి ఆ ఫ్లాట్‌కి వచ్చినప్పుడు శ్రద్ధా వెండి ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చానని ఆఫ్తాబ్ పోలీసులకు చెప్పాడు.ఆ తర్వాత ఆ ఉంగరాన్ని కూడా ఆ యువతి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.శ్రద్ధా మొబైల్ ఫోన్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అన్నీ ముంబైలోని భయందర్ బేలో ఆఫ్తాబ్ విసిరేసినట్లు ఢిల్లీ పోలీసుల ఛార్జిషీట్‌ పేర్కొంది.

ఇది కూడా చదవండి : Layoff: ఈబేలో లేఆఫ్...500 మంది ఉద్యోగుల తొలగింపు

పూనావాలా దూకుడుగా ఉండేవాడని, చిన్న చిన్న విషయాలకే శ్రద్ధావాకర్‌ను కొట్టేవాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 2020వ సంవత్సరంలో పూనావాలా తనను చంపడానికి ప్రయత్నించాడని, తనపై దాడి చేస్తున్నాడని శ్రద్ధావాకర్ ముంబై పోలీసులకు లేఖ రాసింది. ఇక ఆఫ్తాబ్‌తో కలిసి జీవించడం ఇష్టం లేదని శ్రద్ధావాకర్ గతంలోనే పోలీసులకు సమాచారం అందించింది.

Updated Date - 2023-02-08T09:52:15+05:30 IST