Jupiter Planet: గురు గ్రహంపై భారీ ఫ్లాష్‌లైట్.. మళ్లీ అదే రిపీట్ అయ్యిందా?

ABN , First Publish Date - 2023-09-17T19:37:04+05:30 IST

కొన్ని రోజుల క్రితమే సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహమైన గురుడుపై ఒక భారీ విస్ఫోటనం సంభవించింది. సైజులో భూమి కంటే పెద్దగా ఉండే ఒక ఖగోళ శకలం ఢీకొట్టడం వల్ల.. ఆ విస్ఫోటనం సంభవించినట్టు...

Jupiter Planet: గురు గ్రహంపై భారీ ఫ్లాష్‌లైట్.. మళ్లీ అదే రిపీట్ అయ్యిందా?

కొన్ని రోజుల క్రితమే సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహమైన గురుడుపై ఒక భారీ విస్ఫోటనం సంభవించింది. సైజులో భూమి కంటే పెద్దగా ఉండే ఒక ఖగోళ శకలం ఢీకొట్టడం వల్ల.. ఆ విస్ఫోటనం సంభవించినట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. అంతేకాదు.. ఆ దృశ్యాన్ని ట్విటర్ మాధ్యమంగా షేర్ చేశారు. ఇప్పుడు తాజాగా అంతకంటే పెద్ద ఫ్లాష్‌లైట్ గురు గ్రహంపై కనిపించింది. జపనీస్ ఖగోళ శాస్త్రవేత్త తడావో ఓహ్సుగి ఈ ప్రకాశవంతమైన ఫ్లాష్‌ను గుర్తించాడు. ఈ భారీ వాయుగోళం (గురు గ్రహం)లో ఇప్పటివరకూ నమోదైన అతిపెద్ద ఫ్లాష్‌లైట్స్‌లో ఇదే అని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


మన సౌర వ్యవస్థ అంచుల నుండి వచ్చే గ్రహశకలాలు లేదా తోక చుక్కలు.. గురుగ్రహ గురుత్వాకర్షణకు ప్రభావితమై ఆ గ్రహాన్ని ఢీకొట్టినప్పుడు.. ఇలాంటి ప్రకాశంతమైన భారీ ఫ్లాష్‌లైట్స్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు తాజాగా కనిపించిన వెలుగు కూడా అలాంటిదేనని, ఈసారి భారీ శకలం ఢీకొని ఉండొచ్చని, అందుకే మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ భారీ ఫ్లాట్‌లైట్ కనిపించిందని అంటున్నారు. దీనిపై ప్రముఖ శాస్త్రవేత్త డా. అరిమత్సు మాట్లాడుతూ.. గురుగ్రహం తన గురుత్వాకర్షణ శక్తితో భారీ శకలాల్ని ఆకర్షిస్తుందని, అప్పుడది గ్రహంతో ఢీకొని భారీ విస్ఫోటనం సృష్టిస్తుందని, అదే ఫ్లాష్‌లైట్‌గా వెలుగుతుందని తెలిపారు. తాజాగా కనిపించిన ఫ్లాష్‌లైట్ కూడా.. ఒక శకలం ఢీకొట్టడం వల్లే సంభవించిందని తెలిపారు. అధునాతన టెలిస్కోప్‌లతోనూ ఇలాంటి వాటిని పరిశీలించడం అసాధ్యమని అన్నారు.

అయితే.. ఇలాంటి ఫ్లాట్‌లైట్స్ మన సౌర వ్యవస్థ చరిత్రను అర్థం చేసుకోవడానికి కీలకంగా నిలుస్తాయని అరిమత్సు పేర్కొన్నారు. 2010 నుంచి గురుగ్రహంపై మొత్తం తొమ్మిది మెరుపులు సంభవించగా.. వాటిల్లో ఎనిమిది కనిపించాయని ఆయన తెలిపారు. తన విశ్లేషణల్లో భాగంగా.. ఆగస్టులో నివేదించబడిన ఫ్లాష్‌లైట్, 1908లో సైబీరియాలో జరిగిన తుంగుస్కా పేలుడుతో పోల్చవచ్చని అన్నారు. కాగా.. 1994లో షూమేకర్ లేవీ 9 అనే తోకచుక్క గురుగ్రహాన్ని ఢీకొట్టినప్పుడు.. ఆ గ్రహం ఉపరితలంపై పెద్ద వెలుగు కనిపించింది. దీనిని హబుల్ టెలిస్కోప్ చిత్రీకరించింది. ఇప్పుడు తాజాగా కనిపించిన వెలుగు.. దాదాపు అలాంటిదేనని సమాచారం.

Updated Date - 2023-09-17T20:11:55+05:30 IST