Earthquake: సిరియా దేశంలో మళ్లీ భూకంపం...తీవ్రత ఎంతంటే...

ABN , First Publish Date - 2023-02-17T08:05:28+05:30 IST

సిరియా దేశంలో మళ్లీ గురువారం రాత్రి భూకంపం సంభవించింది....

Earthquake: సిరియా దేశంలో మళ్లీ భూకంపం...తీవ్రత ఎంతంటే...
Fresh Earthquake Jolts Syria

డమాస్కస్(సిరియా): సిరియా దేశంలో మళ్లీ గురువారం రాత్రి భూకంపం సంభవించింది.(Fresh Earthquake) ‘‘అసలే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా’’ సిరియా రాజధాని డమాస్కస్,ఉత్తర ప్రావిన్స్ అలెప్పోలో(Syrian capital Damascus) భూకంపం సంభవించింది.(North West Syria) వాయువ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో గురువారం రాత్రి రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని సిరియా జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. గురువారం రాత్రి 10:47 గంటలకు భూకంపం సంభవించింది.

ఈ భూకంపం 18.8 కిలోమీటర్ల లోతులో వచ్చింది. భూకంప కేంద్రం ప్రావిన్స్ రాజధాని ఇడ్లిబ్ నగరానికి 61 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయువ్య తీర ప్రావిన్స్ లటాకియాలో రాత్రి 11:17 గంటలకు మరో సారి 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.46 కిలోమీటర్ల లోతులో రెండవ భూకంపం లటాకియాకు 50 కిలోమీటర్ల దూరంలో నమోదైంది.

తీరప్రాంత ప్రావిన్స్‌లోని స్థానిక ప్రజలు తమ భవనాల గోడల నుంచి దుమ్ము పడిపోవడాన్ని చూసి భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.(people ran out to the streets)ఫిబ్రవరి 6వతేదీన ఆగ్నేయ టర్కీలో రెండు భూకంపాలతో ఉత్తర సిరియా తీవ్రంగా దెబ్బతింది.సిరియాను తాకిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 1,414గా ఉండగా, గాయపడిన వారి సంఖ్య 2,357కి చేరుకుందని సిరియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Updated Date - 2023-02-17T08:22:19+05:30 IST