Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వైద్యపరీక్షల్లో మద్యం, కొకైన్...ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడి

ABN , First Publish Date - 2023-05-27T11:13:28+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ వైద్యపరీక్షల్లో మద్యం, కొకైన్ దొరికిందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్ ఖదీర్ పటేల్ వెల్లడించారు.ఇమ్రాన్ ఖాన్ మూత్రం నమూనాలో ఆల్కహాల్, కొకైన్ వంటి విషపూరిత రసాయనాలు ఉన్నట్లు రుజువు అయిందని,దీంతో అతని మానసిక స్థైర్యం ప్రశ్నార్థకమని చెప్పి అబ్దుల్ ఖాదిర్ పటేల్ దుమారం రేపారు....

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వైద్యపరీక్షల్లో మద్యం, కొకైన్...ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడి
Imran Khan

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ వైద్యపరీక్షల్లో మద్యం, కొకైన్ దొరికిందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్ ఖదీర్ పటేల్ వెల్లడించారు.ఇమ్రాన్ ఖాన్ మూత్రం నమూనాలో ఆల్కహాల్, కొకైన్ వంటి విషపూరిత రసాయనాలు ఉన్నట్లు రుజువు అయిందని,దీంతో అతని మానసిక స్థైర్యం ప్రశ్నార్థకమని చెప్పి అబ్దుల్ ఖాదిర్ పటేల్ దుమారం రేపారు.(Cocaine found in Imran Khan)ఇమ్రాన్ ను మే 9వతేదీన అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో అరెస్టు చేసిన తర్వాత ప్రీమియర్ పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)లో మూత్రం శాంపిల్స్ సేకరించిన తర్వాత జారీ చేసిన వైద్య నివేదికల గురించి మంత్రి పటేల్(claims Pakistan health minister) విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఇది కూడా చదవండి : Karnataka: కాంగ్రెస్ పార్టీకి బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ ఛాలెంజ్

‘‘ఇది మాజీ ప్రధానమంత్రి ఖాన్ మానసిక స్థైర్యం ప్రశ్నార్థకంగా మారిందని ఐదుగురు సీనియర్ వైద్యుల ప్యానెల్ చెబుతోంది. కొన్ని అనుచితమైన సంజ్ఞలు ఉన్నాయి.70 ఏళ్ల ఖాన్ మెడికల్ రిపోర్టు పబ్లిక్ డాక్యుమెంట్ అయినందున దానిని దేశానికి చూపిస్తాం’’ అని మంత్రి చెప్పారు.‘‘మేం ఇమ్రాన్‌తో చాలా సేపు మాట్లాడినప్పుడు, అతని చర్యలు ఫిట్‌గా లేవని వైద్య నివేదిక చెబుతోంది’’ అని మంత్రి చెప్పారు.కాగా మంత్రి అబ్దుల్ ఖాదిర్ పటేల్ చేసిన నిరాధార ఆరోపణలపై పరువు నష్టం కేసు పెడతామని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ట్విట్టర్‌లో రాసింది.

Updated Date - 2023-05-27T11:13:28+05:30 IST