Share News

Gaza: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో జర్నలిస్టు కుటుంబం హతం.. పెరుగుతున్న మ‌ృతుల సంఖ్య

ABN , First Publish Date - 2023-10-26T09:09:40+05:30 IST

ఇజ్రాయెల్(Israeil) తాజాగా జరిపిన వైమానిక దాడిలో గాజా(Gaza)లోని ఓ జర్నలిస్టు(Journalist) కుటుంబం హతమైందని అధికారులు తెలిపారు. గాజాలో అల్ జజీరా జర్నలిస్ట్ వేల్ దహదౌహ్ భార్య కుమారుడు, కుమార్తె నివసిస్తున్నారు.

Gaza: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో జర్నలిస్టు కుటుంబం హతం.. పెరుగుతున్న మ‌ృతుల సంఖ్య

గాజా: ఇజ్రాయెల్(Israeil) తాజాగా జరిపిన వైమానిక దాడిలో గాజా(Gaza)లోని ఓ జర్నలిస్టు(Journalist) కుటుంబం హతమైందని అధికారులు తెలిపారు. గాజాలో అల్ జజీరా జర్నలిస్ట్ వేల్ దహదౌహ్ భార్య కుమారుడు, కుమార్తె నివసిస్తున్నారు. ఇజ్రాయెల్ సేనలు వారు నివసిస్తున్న ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని వైమానిక దాడులకు(Air Strike) దిగబోతున్నాయనే విషయాన్ని ఆయన భార్య తెలుసుకున్నారు. అక్కడి నుంచి తన కుమారుడు, కుమార్తెతో కలిసి పారిపోతుండగా.. ఓ భారీ బాంబు వారు పరిగెడుతున్న ప్రాంతంలో వచ్చి పడింది. ఈ దాడిలో భార్య, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆ జర్నలిస్ట్ వేదన అరణ్యరోదనగా మారింది. గాజా మధ్యలో ఉన్న నుసిరత్ శిబిరం లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసిందని అల్ జజీరా ఓ ప్రకటనలో తెలిపింది. దహదౌ కుటుంబ సభ్యులు శిథిలాల కింద సమాధి అయ్యారని వెల్లడించింది. ఆసుపత్రిలో విగతజీవులుగా పడి ఉన్న కుటుంబసభ్యులను చూసి దహదౌహ్ ఏడుస్తున్న దృశ్యాలు చూపరులకు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇలాంటి కుటుంబాలు ఎందరినో ఇజ్రాయెల్ బలితీసుకుంటోందని అక్కడి ప్రజలు అంటున్నారు. ఈ దాడులను తక్షణం ఆపాలని కోరుతున్నారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.


బందీలను విడుదల చేస్తున్న హమాస్..

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గాజాలో తమ వద్ద బందీలుగా ఉన్న మరో ఇద్దరు ఇజ్రాయెల్ మహిళలను హమాస్ విడుదల చేసింది. వృద్దులైన ఆ ఇద్దరు మహిళలను గాజా, ఈజిప్టు మధ్య ఉన్న రఫా సరిహద్దు వద్ద విడిచిపెట్టారు. మానవతా కారణాల దృష్యా ఆ ఇద్దరు మహిళలను వదిలేసినట్లు హమాస్ సైన్యం తెలిపింది. ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో సదరు మహిళలను హమాస్ సైన్యం సోమవారం రాత్రి వదిలిపెట్టింది. కాగా ఇటీవల ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికాకు చెందిన తల్లీకూతుళ్లను హమాస్ విడిచినపెట్టిన సంగతి తెలిసిందే. మానవతా కోణంలో జుడిత్ తై రానన్, ఆమె కుమార్తె నటాలీ శోషనా రానన్‌ను విడుదల చేసిన కొన్ని రోజుల్లోనే తాజాగా మరో ఇద్దరు మహిళలను కూడా విడుదల చేయడం గమనార్హం. దీంతో హమాస్ చెర నుంచి విడుదలైన బందీల సంఖ్య 4కు చేరుకుంది. అయితే త్వరలోనే హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిలో మరో 50 మందిని విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ మేరకు పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ద్వంద్వ పౌరసత్వం కల్గి ఉన్న బందీలను విడిపించేందుకు రెడ్‌క్రాస్ ప్రతినిధులు గాజాకు వెళ్తున్నారని ఆ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే ఇందులో ఎంతమేరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-10-26T09:10:35+05:30 IST