Yoga: వెన్ను నొప్పి మాయం కావాలంటే...

ABN , First Publish Date - 2023-05-02T12:22:33+05:30 IST

యోగాసనాల్లో అనుసరించే వేర్వేరు భంగిమల వల్ల వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అవేంటంటే...

Yoga: వెన్ను నొప్పి మాయం కావాలంటే...
Yoga

యోగాసనాల్లో అనుసరించే వేర్వేరు భంగిమల వల్ల వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అవేంటంటే...

భరద్వాజాసనం: ఈ ఆసనంతో వెన్నెముక, కటి కండరాలు, ఎముకలు బలపడతాయి.

సేతుబంధనం: మెదడును నెమ్మదించి, అలసిన కళ్లకు ఉపశమనాన్నిస్తాయి.

మార్జర్యాసనం: వెన్ను, ఉదరంలోని అవయవాలు మర్దన అవుతాయి.

అథోముఖ శవాసనం: పూర్తి శరీరం ఉల్లాసభరితమవుతుంది.

అగ్నిస్థంభాసనం: సయాటిక్‌ నరంతో సంబంధమున్న పిరుదుల కండరాలు సాగుతాయి.

అర్థ మత్సేంద్రాసనం: వెన్నును బలపరిచి, ఆకలిని పెంచే అవయవాలను ప్రేరేపిస్తుంది.

అర్ధచంద్రాసనం: కాళ్లు, మడమలు బలపడతాయి.

దనురాసనం: నడుము కింది భాగం, చేతులు శక్తివంతమవుతాయి.

వెన్ను నొప్పి మాయం!

ఎక్కువ సమయంపాటు కూర్చునే ఉండడం, కూర్చునే భంగిమలో పొరపాట్లు, వెన్ను ముందుకు వంచి కూర్చోవడం మొదలైన అలవాట్ల వల్ల వెన్నుముకలోని పూసలు పట్టు తప్పడం, అరిగిపోవడం, తొలగడం లాంటి సమస్యలు మొదలవుతాయి. దాంతో చేతులు, కాళ్లు లాగడం, వెన్ను నొప్పి వేధిస్తాయి. ఈ తిప్పలు తప్పాలంటే సుప్తమత్స్యేంద్రాసనం సాధన చేయాలి. అదెలాగంటే...

  • వెల్లకిలా పడుకుని చేతులు నేల మీద చాపి ఉంచాలి.

  • కుడి కాలును మడిచి, ఎడమ కాలి మీదుగా శరీరం పక్కకు వంచి, నేలను తాకించాలి.

  • నేలను తాకిన కుడి కాలును ఎడమ చేత్తో పట్టుకోవాలి.

  • చేస్తున్నప్పుడు నడుము కింది భాగం మాత్రమే కదలాలి. అంతేగానీ శరీరం మొత్తం కాలుతోపాటు కదపకూడదు.

  • ఈ భంగిమలో అరగంటపాటు ఉండి రెండోవైపు సాధన చేయాలి.

  • ఆసనం పూర్తయిన తర్వాత కాళ్లు రెండు నేలకు ఆనించి పడుకుని, నెమ్మదిగా పైకి లేవాలి.

Updated Date - 2023-05-02T12:22:33+05:30 IST