Expired Medicines: మందులు నిజంగానే ఎక్స్పైర్డ్ అవుతాయా..? ఎక్స్పైరీ డేట్ తర్వాత రోజు మందులను మింగితే ఏమౌతుంది..?
ABN , First Publish Date - 2023-04-03T14:18:19+05:30 IST
ప్రస్తుత కాలంలో వాతావరణ మార్పులు, ఆహారంతో పాటు ప్రతి ఒక్కటీ కలుషితమవడంతో చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. 20 ఏళ్లకే ఏదో ఒక రోగం బారిన పడుతున్నాం. దీంతో మందుల వాడకం పెరిగిపోయింది.
ప్రస్తుత కాలంలో వాతావరణ మార్పులు, ఆహారంతో పాటు ప్రతి ఒక్కటీ కలుషితమవడంతో చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. 20 ఏళ్లకే ఏదో ఒక రోగం బారిన పడుతున్నాం. దీంతో మందుల వాడకం పెరిగిపోయింది. మనమందరం ప్రతిరోజూ ఏదో ఒక ట్యాబ్లెట్‌ను తీసుకుంటున్నాం. ఇక మనకు తరచుగా ఎదురవుతున్న అసలు సమస్యలు ఏంటంటే... మనం ఒక మెడిసిన్‌ను ఎంతకాలం పాటు వాడాలి? ఎంత కాలం పాటు మందులను మన ఇంట్లో ఉంచుకోవచ్చు? అనేవి. నిజానికి ప్రతి ఏడు దాదాపు 50 వేల మంది పిల్లలు కాలం ముగిసిన మందులను తీసుకుని ఐసీయూలో చేరుతున్నారట. కాబట్టి గడువు ముగిసిన ఔషధాలను తప్పని సరిగా పారేయాలి. ఇవి పొరపాటున తీసుకున్నా కొన్ని సార్లు దాని ఫలితం దారుణంగా ఉంటుంది.
నిజంగానే మందులు ఎక్స్పైర్ అవుతాయా?
గడువు ముగిసిన మందులను వెంటనే పారవేయాలి. అది కూడా ప్రమాదవశాత్తూ పిల్లలు, పెంపుడు జంతువులకు దొరక్కుండా చూడాలి. కొన్ని మందులు తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి. నివేదికల ప్రకారం.. ఇన్సులిన్, ఇతర మందులు కాలక్రమేణా తమ ప్రభావాన్ని కోల్పోతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యాంటీబయాటిక్స్ వంటి మందులు విస్తృతంగా ఉపయోగించాలి కానీ నిర్దేశించిన వ్యవధికి మించి వినియోగించకూడదు. కొన్నిసార్లు ఔషధాలను తడిగా ఉన్న ప్రదేశాలలో లేదా అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో నిల్వ చేయడం వలన గడువు తీరక ముందే అవి పాడైపోతాయి.
మందులను ఎలా డిస్పోజ్ చేయాలి?
కొన్ని మందులు ఎక్కువ కాలం నిల్వ ఉంటే కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. వాటిని పిల్లలు కానీ.. పెంపుడు జంతువులు కానీ ప్రమాదవశాత్తు తీసుకుంటే.. మరణించే అవకాశాలు లేకపోలేదు. ఔషధాలను ఎలా పడితే అలా పడేయకూడదు. వాటిని చెత్తలో వేయవచ్చు.. కానీ వాటిని డబ్బాల్లో కానీ సీల్డ్ కవర్స్‌లో కానీ వేసి పడేయాలి. అలాగే ఒక వ్యక్తి.. మరొకరికి మందులు ఇవ్వడం వంటివి చేయడం.. లేదంటే బహిరంగ ప్రదేశాల్లో పడేయడం వంటివి చేయకూడదు.