Palm fronds: గర్భిణీలు ఈ పండును తింటే..!

ABN , First Publish Date - 2023-05-24T12:13:15+05:30 IST

వేసవి అంటే చాలు తాటి ముంజలు గుర్తొస్తాయి. తియ్యగా, నీటి పరిమాణం అధికంగా ఉండే ఈ తాటిపండు తింటే

Palm fronds: గర్భిణీలు ఈ పండును తింటే..!
Palm fronds

వేసవి అంటే చాలు తాటి ముంజలు గుర్తొస్తాయి. తియ్యగా, నీటి పరిమాణం అధికంగా ఉండే ఈ తాటిపండు తింటే శరీరానికి ఎంతో చలువ. వీటితో పాటు మరికొన్ని లాభాలున్నాయి.

• ఇవి తింటే పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. దీంతో పాటు పొట్ట శుభ్రం అవుతుంది. చెడుకొలెస్ట్రాల్‌ తొలగిపోయి బరువు తగ్గుతారు.

• వీటిలో పొటాషియం ఉండటం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. దీని వల్ల గుండెకు మంచిది. శరీరంలోని వ్యర్థపదార్థాలను తొలగించే గుణం వీటికి ఉంది.

• అలసట చెందినపుడు, శరీరంలో నీటిశాతం తగ్గిపోయినప్పుడు ఈ పండ్లను తింటే తక్షణమే శక్తి కలుగుతుంది.

• వీటిలో నీటిశాతంతో పాటు విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, జింక్‌, పాస్ఫరస్‌ లాంటి పోషకాలు ఎక్కువే. ఇందువల్ల తిన్న ఈ పండు సులువుగా జీర్ణం అవుతుంది. కడుపు ఉబ్బరం, కడుపులో మంటతో బాధపడుతుండేవాళ్లు ఈ పండ్లను తింటే సమస్య తగ్గిపోతుంది. ముఖ్యంగా మలబద్ధకం ఇబ్బందులు తొలగిపోతాయి.

• వందగ్రాముల తాటి ముంజెల్లో 42 కేలరీలుంటాయి.

• గర్భిణులు కూడా ఈ పండును తింటే మేలు కలుగుతుంది.

• ఇకపోతే ఈ పండును తినటం వల్ల చర్మ ఆరోగ్యం కూడా వస్తుంది. ముఖ్యంగా వేడివల్ల మొటిమలు, దద్దుర్లు రాకుండా ఇవి కాపాడతాయి.

Updated Date - 2023-05-24T12:13:36+05:30 IST