Summer: వేసవిలో చర్మం ఇలా కాకుండా ఉండాలంటే..!

ABN , First Publish Date - 2023-04-06T11:39:53+05:30 IST

ఎండతో చర్మం నల్లబడకుండా సన్‌స్ర్కీన్‌ అప్లై చేస్తూ ఉంటాం. అయినా చర్మం ఎంతో కొంత ట్యాన్‌కు గురవుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే తరచూ స్కిన్‌ ప్యాక్స్‌ అప్లై చేస్తూ ఉండాలి.

Summer: వేసవిలో చర్మం ఇలా కాకుండా ఉండాలంటే..!
Summer

ఎండతో చర్మం నల్లబడకుండా సన్‌స్ర్కీన్‌ (Sun screen) అప్లై చేస్తూ ఉంటాం. అయినా చర్మం (skin) ఎంతో కొంత ట్యాన్‌కు గురవుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే తరచూ స్కిన్‌ ప్యాక్స్‌ అప్లై చేస్తూ ఉండాలి.

టమాటా ప్యాక్‌: టమాటా రసం, నిమ్మరసం, తేనెలను కలిపి ముఖం, ముంజేతుల మీద ప్యాక్‌ వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకుంటే, సన్‌ ట్యాన్‌ వదిలిపోతుంది.

పెరుగు ప్యాక్‌: పెరుగు, రోజ్‌వాటర్‌, తేనెలను కలిపి ప్యాక్‌ వేసుకున్నా ఫలితం ఉంటుంది.

అరటి తొక్క: అరటి తొక్కతో ముఖం, మెడ, చేతులు రుద్దుకుంటే వేడిమి వల్ల కమిలిన చర్మం జీవం పోసుకుని, ఆకర్షణీయంగా మారుతుంది.

ఆలూ ప్యాక్‌: బంగాళాదుంపల తరుగును మిక్సీలో వేసి, రసం తీసుకుని, నేరుగా ముఖం మీద అప్లై చేసుకుని, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే సన్‌ ట్యాన్‌ తగ్గిపోతుంది.

Updated Date - 2023-04-06T11:39:53+05:30 IST