Summer care: ఉపశమనం కోసం ఫ్రిజ్‌లో నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ABN , First Publish Date - 2023-03-28T13:24:30+05:30 IST

వేసవిలో దాహార్తి తీర్చుకోవడం కోసం ఫ్రిజ్‌లో నీళ్ల మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ ఈ నీళ్లతో దాహార్తి తీరదు. ఇందుకు

Summer care: ఉపశమనం కోసం ఫ్రిజ్‌లో నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
Summer care

వేసవిలో దాహార్తి తీర్చుకోవడం కోసం ఫ్రిజ్‌లో నీళ్ల మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ ఈ నీళ్లతో దాహార్తి తీరదు. ఇందుకు కారణం చల్లని నీళ్ల అరుగుదలకు ఎక్కువ సమయం పట్టడమే! పొట్టలోని ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండే గది ఉష్ణోగ్రతలోని నీళ్లు తాగడం వల్ల నీళ్లు త్వరగా జీర్ణమై శరీరం డీహైడ్రేషన్‌కు లోను కాకుండా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకూ గడ్డకట్టిన చల్ల నీళ్లకు దూరంగా ఉండాలి. నీళ్లకు అదనంగా మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, ఓఆర్‌ఎస్‌ లాంటి వాటిని తాగడం వల్ల చమట ద్వారా కోల్పోయే లవణాలు భర్తీ అవుతూ, డీహైడ్రేషన్‌కు లోను కాకుండా ఉంటాం.

Updated Date - 2023-03-28T13:24:30+05:30 IST