Raisins: ఎండుద్రాక్షను ఇలా చేసి చూడండి !

ABN , First Publish Date - 2023-02-21T15:00:55+05:30 IST

గోరువెచ్చని పాల (Milk) ను పెరుగు (Curd)తో తోడు పెట్టే సమయంలోనే పాలలో ఒక టీ స్పూన్‌ ఎండుద్రాక్ష (Raisins) వేస్తే, మరుసటి రోజుకు ఎండుద్రాక్ష పెరుగు సిద్ధమవుతుంది.

Raisins: ఎండుద్రాక్షను ఇలా చేసి చూడండి !
ఆ పదార్థం అమోఘం

గోరువెచ్చని పాల (Milk) ను పెరుగు (Curd)తో తోడు పెట్టే సమయంలోనే పాలలో ఒక టీ స్పూన్‌ ఎండుద్రాక్ష (Raisins) వేస్తే, మరుసటి రోజుకు ఎండుద్రాక్ష పెరుగు సిద్ధమవుతుంది. దీన్ని మధ్యాహ్న భోజనం (lunch తర్వాత లేదా సాయంత్రం స్నాక్‌ (Snacks)గా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటంటే....

  • పెరుగు ప్రొబయాటిక్‌, ఎండుద్రాక్ష ప్రిబయాటిక్‌.. ఈ రెండింటి అరుదైన సమ్మేళనం అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగు పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది. ఈ బ్యాక్టీరియాకు అవసరమైన ఆహారాన్ని ఎండుద్రాక్షలోని పీచు సమకూరుస్తుంది.

  • ఈ రెండింటి సమ్మేళనం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి, యుటిఐ, కొలెస్ట్రాల్‌, అకారణంగా బరువు పెరగడం, థైరాయిడ్‌, పిసిఒడిల నుంచి ఉపశమనం దక్కుతుంది.

  • పెరుగుతో బరువు పెరుగుతామనేది అపోహ. ప్రతి రోజూ ఇలా ఎండుద్రాక్షలతో తయారుచేసుకున్న పెరుగును తినడం వల్ల బరువు తగ్గుతాం.

  • పెరుగు కోసం ఉపయోగించే పాలు వెన్న తీయని పాలై ఉండాలి. చిక్కని పెరుగులోనే అమూల్యమైన పోషకాలుంటాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి.

Updated Date - 2023-02-21T15:00:56+05:30 IST