Nightmares: పిచ్చిపిచ్చి కలలతో వేకువజామున 3 గంటలకు ఉలిక్కిపడి లేస్తుంటారు.. చాలామందికి ఇలా ఎందుకు జరుగుతుందంటే..

ABN , First Publish Date - 2023-04-03T12:08:11+05:30 IST

ఒక సౌండ్ స్లీప్ కాస్తా సడెన్‌గా కనుమరుగై పోయింది. తెల్లవారుజామున 3 గంటలకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. తిరిగి నిద్రపోవాలంటే ఓ యాగమే చేయాలి. ఆ సమయంలో నిద్ర పట్టక అతిగా ఆలోచించడం చాలా సాధారణం కానీ ఈ అలవాటును కొనసాగించడం కరెక్టా?

Nightmares: పిచ్చిపిచ్చి కలలతో వేకువజామున 3 గంటలకు ఉలిక్కిపడి లేస్తుంటారు.. చాలామందికి ఇలా ఎందుకు జరుగుతుందంటే..

ఒక సౌండ్ స్లీప్ కాస్తా సడెన్‌గా కనుమరుగై పోయింది. తెల్లవారుజామున 3 గంటలకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. తిరిగి నిద్రపోవాలంటే ఓ యాగమే చేయాలి. ఆ సమయంలో నిద్ర పట్టక అతిగా ఆలోచించడం చాలా సాధారణం కానీ ఈ అలవాటును కొనసాగించడం కరెక్టా? అంటే అస్సలు కాదు. ఈ సమయంలో ఆలోచనలు చాలా బాధిస్తాయి. ప్రశాంతమైన నిద్రను దూరం చేస్తాయి. ఈ సమయంలో వేధించే ఆందోళనలు పగటిపూట అయితే ఉండవు. అయితే ఆ సమయంలో అలా మెలకువ రావడానికి సైంటిఫిక్, బయోలాజికల్ కాఱనం ఉందని నిపుణులు చెబుతున్నారు.తెల్లవారుజామున 3 గంటలకు ఆలోచనలు కాస్త ఆందోళన కలిగిస్తాయి. ఆ సమయంలో మనలో కొన్ని భయాలు, వైఫల్యాలు గుర్తొచ్చి మరీ ఇబ్బంది పెడతాయి. ఈ ఆలోచనలు అటువంటి సమయంలో రావడం ఖచ్చితంగా విచిత్రంగా అనిపిస్తుంది. దీనికోసం ఎందుకిలా జరుగుతోందని గూగుల్‌ను వెదకడం.. అదే ఆలోచనలపై ఉంటూ ఆందోళన చెందడం వంటివి ముందుగా చేయవద్దని నిపుణులు తెలిపారు.

మనకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి?

తెల్లవారుజామున 3 గంటలకు, మన శరీర ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమవుతుంది. మన స్లీప్ డ్రైవ్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. మనం హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య నిద్ర పోతాం. ఆ తరువాత అంటే తెల్లవారుజామున 3 గంటలకు మనకు అంత గాఢ నిద్ర ఉండదు. ఇది మనం మేల్కోవడానికి కారణం అవుతుంది. మన స్ట్రెస్ హార్మోన్, కార్టిసాల్ కూడా పెరగడం మొదలవుతుంది. ఇది మరుసటి రోజు మనం మేల్కొవడానికి కారణమవుతుంది. ఇక నేచర్ పరంగా చూస్తే ఈ టైమ్ మనం ఫిజికల్‌గా.. ఎమోషనల్‌గా రికవరీ అవడానికి దోహదపడుతుంది.

ఎలా ఎదుర్కోవాలి?

మన భయాలన్నింటికి లొంగిపోయి.. కృంగిపోకుండా ఉండేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఒకవేళ మీరు ఏవైనా నెగిటివ్ ఆలోచనల్లోకి వెళ్లిపోతుంటే మాత్రం.. బుద్దిజానికి సంబంధించిన కొన్ని ఆచారాలు బాగా సహాయపడతాయి. మానసిక ఒత్తిడులను జయించడంలో బౌద్ధమతం బాగా సహకరిస్తుంది. సెల్ఫ్ అనేది ఒక ఫిక్షన్ అని.. అది అన్ని రకాల బాధలకు మూలం. ఆ సమయంలో సెల్ఫ్‌పై ఫోకస్ పెట్టవద్దు. ధ్యానం సాధన చేయడం.. మెడిటేషన్ చేయడం వంటి వాటిపై దృష్టి పెట్టండి. నెగిటివ్ ఆలోచనలు చుట్టుముట్టిన ప్రతిసారి మెడిటేషన్ చేసి శ్వాసపై ఫోకస్ పెడితే ఫలితం ఉంటుంది.

Updated Date - 2023-04-03T12:08:11+05:30 IST