Urination: ఆ సమయంలో మంట వస్తోంది! దీనికి పరిష్కారం ఉందా?

ABN , First Publish Date - 2023-06-15T13:00:56+05:30 IST

డాక్టర్‌...నాకు తరచుగా మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ వస్తూ ఉంటుంది. మూత్రం వచ్చినట్టు ఉండటం, మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధ పడుతున్నాను. ఈ సమస్యకు

Urination: ఆ సమయంలో మంట వస్తోంది! దీనికి పరిష్కారం ఉందా?

డాక్టర్‌...నాకు తరచుగా మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ వస్తూ ఉంటుంది. మూత్రం వచ్చినట్టు ఉండటం, మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధ పడుతున్నాను. ఈ సమస్యకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి?

- రత్న కుమారి, రాజమండ్రి.

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ అదుపు కావాలంటే ఆ ఇన్‌ఫెక్షన్‌కు కారణాన్ని కనిపెట్టాలి. ఇందుకోసం యూరిన్‌ కల్చర్‌ చేయించుకుంటే సరిపోతుంది. పరీక్ష ఫలితాన్ని బట్టి యాంటీబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది. ఈ మందులకుతోడు మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ తరుచుగా రాకుండా ఉండాలంటే రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. మల విసర్జన తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకునేటప్పుడు చేతిని వెనక నుంచి ముందుకు కాకుండా, ముందు నుంచి వెనక్కి కదిలించే పద్ధతిని అలవాటు చేసుకోవాలి. శుభ్రమైన లోదుస్తులు వాడాలి. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ పౌడర్లు వాడాలి. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నా, మెనోపాజ్‌ దశకు చేరుకున్నా తరచూ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు వేధిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కారణాలను కూడా గమనించుకోవాలి. అలాగే నెలసరి సమయంలో వాడుకునే న్యాప్కిన్లను ప్రతి నాలుగు గంటలకు ఒకసారి మర్చేస్తూ ఉండాలి. ఎక్కువ సమయాల పాటు న్యాప్కిన్లను మార్చకపోయినా మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్లు తరచూ వేధిస్తుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను కలవడం అవసరం. లేదంటే ఇన్‌ఫెక్షన్‌ మూత్రపిండాలకు పాకే ప్రమాదం ఉంటుంది.

- డాక్టర్‌ రామ్మోహన్‌, నెఫ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌

Updated Date - 2023-06-15T13:00:56+05:30 IST