Share News

Health Tips: చలికాలంలో జరిగే బిగ్ మిస్టేక్ ఇదే.. ఇష్టంగా తినే ఈ 6 ఆహారాల వల్ల ఏం జరుగుతుందంటే..!

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:18 PM

చాలామంది చలినుండి ఊరట పొందడానికి తింటున్న 6 ఆహార పదార్థాల గురించి తెలిస్తే!

Health Tips: చలికాలంలో జరిగే బిగ్ మిస్టేక్ ఇదే.. ఇష్టంగా తినే ఈ 6 ఆహారాల వల్ల ఏం జరుగుతుందంటే..!

సీజన్ కు తగ్గట్టు ప్రజల జీవనశైలి కూడా మారుతుంది. ఆహారం నుండి వస్త్రాధారణ వరకు ప్రతిదీ మార్పుకు లోనవుతుంది. ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేటికాలంలో రుచుల దగ్గర ప్రజలు ఏ మాత్రం కాంప్రమైజ్ కారు. చల్లని వాతావరణంలో వేడివేడిగా ఏమైనా తింటే బాగుంటుందని అనుకుంటారు. ఇంట్లోనో లేక బయటో ఏదో ఒకటి వేడిగా తాగడమో లేదా తినడమో చేస్తే తప్ప చలికి శరీరం సర్ధుబాటు కాలేదని అనుకుంటారు. అయితే చాలామంది చలినుండి ఊరట పొందడానికి తింటున్న 6 ఆహార పదార్థాలు చాలా పెద్ద చేటు చేస్తన్నాయట. అవేంటో.. ఎలా నష్టం చేస్తాయో తెలుసుకుంటే..

కాఫీ,టీ..(Coffee, Tea)

చలిని బీట్ చెయ్యడానికి చాలామంది ఆశ్రయించేది కాఫీ, టీ లనే. ఇంట్లో అయినా ఆఫీసులలో అయినా పనులు చురుగ్గా చేయడానికి కాఫీ,టీలు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. అయితే వీటిలో కెఫిన్ పదే పదే మూత్రవిసర్జనను ప్రేరేపిస్తుంది. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది.

ఇది కూడా చదవండి: రోజూ 2కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే.. జరిగేది ఇదే..!


నూనెలో వేయించిన ఆహారాలు..(oil foods)

చల్లని వాతావరణంలో వేడిగా పకోడీలో, సమోసాలో లేక మరేదైనా కారంగా ఉన్న ఆహారమో తినాలని అనుకుంటారు. మాములు రోజుల్లో కంటే చలికాలంలోనే వీటిని ఎక్కువ తింటారు. ఇవి ఎక్కువగా తింటే మధుమేహం, ఊబకాయం, రక్తపోటుతో పాటు చెడు కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది.

బేకరీ ఫుడ్స్..(Bakery foods)

సీజన్ కు తగ్గట్టు బేకరీ ఆహారాల సెలక్షన్ కూడా మారిపోతుంటుంది. మైదాతో తయారుచేసే పిజ్జా, బర్గర్, కేకులు, బ్రెడ్, శాండ్విచ్ వంటివి చాలా ఎక్కువగా తింటారు. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా చలికాలంలో ఎక్కువ జరుగుతాయి. వీటిని తింటే మధుమేహం చాలా ఈజీగా అటాక్ చేస్తుంది.

ఇది కూడా చదవండి: Viral Video: ప్రాంక్ చేయడమంటే మీకూ సరదానా? ఈ వీడియో చూసిన తరువాత మీ అలవాటు మారిపోతుందేమో..!



పాలు, పాల ఉత్పత్తులు..(Milk, milk products)

కాఫీ, టీ, స్మూతీలు, పనీర్, పాల సంబంధిత స్వీట్లు ఎక్కువగా తీసుకోకూడదు. చలికాలంలో వీటిని ఎక్కువ తీసుకుంటే శ్లేష్మం పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది.

సలాడ్లు..(Salads)

ఆరోగ్యం మీద స్పృహతో చాలామంది సలాడ్లు తింటారు. వీటిలో పచ్చి కూరగాయలు ఉంటాయి. అయితే చలికాలంలో పచ్చివి తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చలికాలంలో పచ్చి కూరగాయలలో తొందరగా బ్యాక్టీరియా డవలప్ అవుతుంది. ఈ కారణంగా తొందరగా ఇన్పెక్షన్లు వస్తాయి.

ఇది కూడా చదవండి: పిల్లలలో మొబైల్ వ్యసనం.. ఈ పనులు చేస్తే మాయం!

మాంసం..(meat)

చల్లని చలికి వేడి వేడిగా నాన్ వెజ్ తినడం కూడా చాలామందికి ఇష్టం. కానీ చలికాలంలో మాంసం మంచిది కాదు. ఈ కాలంలో జీర్ణక్రియ కాస్త నెమ్మదిగా ఉంటుంది. మాంసం జీర్ణం కావడానికి ఇబ్బంది అవుతుంది. అందులోనూ ప్రాసెస్ చేసిన మాంసం మరీ డేంజర్. ఇవి గుండెకు ప్రమాదం కలిగిస్తాయి.

(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న విషయాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యసమస్యలు ఏమైనా ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 18 , 2023 | 12:18 PM