Obesity: బరువు పెంచే అలవాట్లు ఇవే!

ABN , First Publish Date - 2023-02-21T15:31:43+05:30 IST

మనం అనుసరించే కొన్ని ఉదయపు అలవాట్లు మన అధిక బరువుకు కారణమవుతూ ఉంటాయి. అవేంటంటే....

Obesity: బరువు పెంచే అలవాట్లు ఇవే!
అధిక బరువుకు కారణమివే

మనం అనుసరించే కొన్ని ఉదయపు అలవాట్లు మన అధిక బరువుకు కారణమవుతూ ఉంటాయి. అవేంటంటే....

అతి నిద్ర: నిద్ర తగ్గితే బరువు పెరుగుతామనే విషయం అందరికీ తెలిసిందే! అయితే నిద్ర పెరిగినా ఇదే ఫలితం దక్కుతుంది. రోజుకు పది గంటలు నిద్రపోయే వ్యక్తుల్లో బిఎమ్‌ఐ పెరిగిపోయే అవకాశాలున్నాయని పరిశోధనల్లో తేలింది. కాబట్టి వీలైనంత త్వరగా నిద్రకు ఉపక్రమించి, వీలైనంత త్వరగా నిద్ర లేవాలి.

వెలుతురు: పడక గదిలోకి సహజసిద్ధమైన వెలుగు ప్రసరించేలా చూసుకోవాలి. కిటికీలు, కర్టెన్లు మూసి ఉంచి, సూర్యరశ్మి చొరబడకుండా చీకట్లో నిద్ర లేవడం వల్ల శరీరం బడలికను వదిలించుకోలేదు. ప్రకృతిసిద్ధమైన ప్రయోజనాలను అందుకోలేదు. శరీర జీవగడియారం క్రమ పద్ధతిలో నడుచుకోవాలంటే నిద్ర లేచిన వెంటనే శరీరానికి సూర్యరశ్మి సోకనివ్వాలి.

పడక సర్దడం: రాత్రి పడుకునే ముందు, ఉదయం నిద్ర లేచిన వెంటనే దుప్పట్లు మడత పెట్టడం, దిండ్లు, పరుపును సర్దుకునే అలవాటు అలవరుచుకోవాలి. ఇలాంటి అలవాటు వల్ల రాత్రి పడక చేరిన వెంటనే నిద్ర ముంచుకొస్తుంది. నిద్రలేమి సమస్య తప్పుతుంది. అలాగే ఒక క్రమశిక్షణ అలవాటై, వేళకు నిద్ర ఆవరిస్తుంది, ఉదయం కొత్త హుషారుతో మేలుకోగలుగుతాం.

బ్రేక్‌ఫాస్ట్‌: రోజులో అత్యంత ముఖ్యమైన ఆహారం బ్రేక్‌ఫాస్ట్‌. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మానేయకూడదు. ఉదయాన్ని ఉపవాసంతో మొదలుపెట్టి, మధ్యాహ్నం అవసరానికి మించిన ఆకలితో ఎక్కువ ఆహారం తినడం అనారోగ్యకరం. ఈ అలవాటు అధిక బరువుకు దారి తీస్తుంది. కాబట్టి తగినన్ని పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు ఉండే బలవర్థకమైన బ్రేక్‌ఫా్‌స్టతో రోజును మొదలుపెట్టాలి.

Updated Date - 2023-02-21T15:31:44+05:30 IST