Share News

Custard Apple: సీతాఫలంతో ఎన్ని లాభాలో..!

ABN , First Publish Date - 2023-11-22T11:28:19+05:30 IST

కొండ ప్రాంతాల్లో పెరిగే ఈ సీతాఫలం పండును ఇష్టపడని వారుండరు. మాగిన సీతాఫలం తింటే ఇట్టే కడుపు నిండుతుంది. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సీతాఫలం సంగతులివే...

Custard Apple: సీతాఫలంతో ఎన్ని లాభాలో..!

కొండ ప్రాంతాల్లో పెరిగే ఈ సీతాఫలం పండును ఇష్టపడని వారుండరు. మాగిన సీతాఫలం తింటే ఇట్టే కడుపు నిండుతుంది. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సీతాఫలం సంగతులివే...

  • సీతాఫలం పండులో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. దీని వల్ల సులువుగా తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. అందుకే చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్ల వరకు ఈ పండును తినటానికి ఇష్టపడతారు.

  • ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలం. ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. ముఖ్యంగా ఈ పండు తినటం వల్ల ఇందులోని విటమిన్‌-ఎ దక్కుతుంది. దీనివల్ల కంటి ఆరోగ్యం కలుగుతుంది.

  • మెదడు ఆరోగ్యానికి మంచిది.

  • ఇందులోని బి6 విటమిన్‌ వల్ల మూడ్‌ స్వింగ్స్‌ తగ్గుతాయి. డిప్రషన్‌, ఒత్తిడి దరిచేరే అవకాశాలు తక్కువ.

  • పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల రక్తపోటు సమస్య ఉండదు. దీనివల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

  • చర్మ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగడే లక్షణాలు ఈ పండులో ఉన్నాయి.

  • ఇందులో ఐరన్‌ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది.

  • వందగ్రాముల సీతాఫలంలో 94 కేలరీలుంటాయి. అందుకే ఈ పవర్‌ ఫుడ్‌ తింటే బరువు పెరిగే అవకాశాలెక్కువ.

  • నీరసంగా ఉన్నప్పుడు.. ఈ పండు తినటం వల్ల తక్షణమే శక్తి వస్తుంది.

  • కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి మేలు. కీళ్లనొప్పులు దరిచేరవు.

  • రుచితో పాటు పోషకాల్లోనూ మేటి అయిన ఈ పండును తింటే డయాబెటిస్‌ లాంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. క్యాన్సర్‌ లక్షణాలు వచ్చే అవకాశం ఉండదు.

  • కడుపులోని అసిడిటీ తగ్గిపోతుంది. సీతాఫండ్లే కాదు ఆకుల పసరును తాగితే సీజనల్‌ వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు.

  • సీతాఫలం ఆకుల గుజ్జును గాయాలకు పట్టిస్తే త్వరగా మానిపోతాయి.

  • వ్యాధినిరోధక శక్తిని పెంచే అద్భుతమైన పండు సీతాఫలం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2023-11-22T11:54:58+05:30 IST