Childrens: పిల్లలు పక్క తడుపుతున్నారా? అయితే కారణమిదే..!

ABN , First Publish Date - 2023-05-23T12:26:04+05:30 IST

మూత్రాశయం మీద నియంత్రణ సాధించలేని పిల్లలు పక్క తడపటం సహజం. సాధారణంగా ఆరేళ్లలోపు పిల్లలు పక్క తడుపుతూ ఉంటారు. కొందరికి ఈ అలవాటు యుక్త వయసు

Childrens: పిల్లలు పక్క తడుపుతున్నారా? అయితే కారణమిదే..!
Childrens

మూత్రాశయం మీద నియంత్రణ సాధించలేని పిల్లలు పక్క తడపటం సహజం. సాధారణంగా ఆరేళ్లలోపు పిల్లలు పక్క తడుపుతూ ఉంటారు. కొందరికి ఈ అలవాటు యుక్త వయసు వరకూ కొనసాగుతుంది. ఇందుకు తీవ్రమైన శారీరక, మానసిక అనారోగ్యాలేవీ కారణం కావు. పిల్లలు పక్క తడుపుతున్నారంటే వారికా అలవాటు పెద్దల నుంచి సంక్రమించిందని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరికీ వారి బాల్యంలో ఆ అలవాటుంటే పిల్లలకు కచ్చితంగా ఆ అలవాటు సంక్రమిస్తుంది. అయితే ఈ అలవాటు పెరిగే వయసుతోపాటు మటుమాయమవుతుంది. కానీ ఈ అలవాటు వల్ల పిల్లలు ఆత్మ న్యూనతకు గురవుతూ ఉంటారు. అలాంటప్పుడు పెద్దలు వారికి మానసిక భరోసా కల్పించాలి. పెద్దయ్యేకొద్దీ తగ్గిపోతుందని నచ్చ చెప్పాలి. ప్రతి రాత్రీ నిద్రకు ముందు పిల్లలని బాత్రూమ్‌కి వెళ్లే అలవాటు చేయాలి. పక్క తడిపే అలవాటు అసహజంగా ఉంటే వైద్యుల్ని సంప్రతించటమే ఉత్తమం. పిల్లల్లో ఈ తేడాలు గమనిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రతించాలి.

  • పగటి వేళ కూడా మూత్ర విసర్జనతో దుస్తులు తడిపేసుకుంటున్నా..

  • మూత్ర విసర్జనతోపాటు మంట, నొప్పి ఉందని చెప్తున్నా...

  • పాదాలు, కాలి గిలకలు వాస్తున్నా....

  • ఏడేళ్లు దాటినా పక్క తడుపుతున్నా....

  • ఆరు నెలలపాటు మానేసి హఠాత్తుగా పక్క తడిపినా....

  • ఈ అలవాటుతో పాటు గురక పెడుతున్నా....

  • అవసరానికి మించిన ఆకలి, దప్పిక ఉన్నా...

Updated Date - 2023-05-23T12:26:04+05:30 IST