Water: మట్టికుండలోని వాటర్ గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

ABN , First Publish Date - 2023-04-03T13:19:37+05:30 IST

పేదవాడి ఫ్రిజ్‌ మట్టికుండ అని అంటుంటారు. మట్టికుండలో నీరు మహా ప్రసాదం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుండలో నీరు అతి శీతలంగాను, వేడిగానూ ఉండవు. కుండలకు చిన్న రంధ్రాలు ఉండడంతో

Water: మట్టికుండలోని వాటర్ గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
Pot Water

పేదవాడి ఫ్రిజ్‌ మట్టికుండ అని అంటుంటారు. మట్టికుండలో నీరు మహా ప్రసాదం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుండలో నీరు అతి శీతలంగాను, వేడిగానూ ఉండవు. కుండలకు చిన్న రంధ్రాలు ఉండడంతో మలినాలు తీసేసి నీరు తాజాగా ఉంటుంది. ఎండలో నుంచి ఇంటికి వచ్చి మట్టికుండలో నీరు తాగితే హాయిగా ఉంటుంది. రిఫ్రిజిరేటలో బాటిల్స్‌ పెట్టి నీరుతాగితే గొంతు నొప్పి, జలుబు, ఇతర సమస్యలు వస్తాయి. మట్టికుండలో నీరు తాగితే శ్రేష్టమని వైద్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం అన్ని ఖర్చులతోపాటు మట్టికుండల ఖరీదు కూడా పెరిగింది. వీటిని తయారు చేసే కుమ్మరులు రవాణా ఖర్చుతో కలిసి చిన్న కుండలు రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. పెద్దకుండ అయితే రూ. 250 నుంచి రూ.350 వరకు అమ్ముతున్నారు. ఇప్పుడు కుండలకు నల్లాలు కూడా అమర్చుతున్నారు. నల్లా ఉంటే అదనంగా రూ. 50 వసూలు చేస్తున్నారు. మట్టికుండలో నీరు నిరంతరం చల్లగా ఉంటుంది.

POT2.jpg

ఉపయోగాలు

  • మట్టికుండలో సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. ఇవి బాష్పీభవనాన్ని సులభతరం చేయడంలో సహాయపడతాయి. తద్వారా నీటిని చల్లబరుస్తుంది.

  • మట్టికుండలో నీరు ఆల్కలీన్‌ స్వభావం కలిగి ఉంటాయి. ఆమ్లతను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.

  • కుండలో నీరు తాగడం వలన ఆమ్లత్వా న్ని అరికట్టి, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.

  • దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి మట్టికుండలో నిల్వ ఉంచిననీరు అనువైంది.

  • మెటబాలిజం, వైరాలిటీని మెరుగుపరుస్తుంది.

  • కుండలో పోసిన నీటితో ముఖం కడుక్కుంటే వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది.

మట్టి దొరకడం లేదు

తమ కుటుంబం కుమ్మరి వృత్తిపై జీవిస్తోంది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం కుండల తయారీ ఖర్చుతో కూడుకున్నది. కుండల తయారీకి మట్టి దొరకకపోవడంతో రేట్లు రెండితలు పెరిగాయి. వేసవిలోనే కుండలకు గిరాకీ, తర్వాత ఖాళీగా ఉండాల్సిందే. ప్రభుత్వం నుంచి తమకు సహాయం అందడం లేదు.

- యాదగిరి

కుండ సైజును బట్టి రేటు

పూర్వీకుల నుంచి కుమ్మరి వృత్తిపైనే జీవనం సాగిస్తునాం. సీజన్‌లో కుండలు అమ్ముకొని, అన్‌ సీజన్‌లో ఇంటివద్ద ఖాళీగా ఉంటాం. కుండల సైజును బట్టి రేటు నిర్ణయిస్తాం. ఎండలు పెరగడం వల్ల ప్రస్తుతం గిరాకీ బాగానే ఉంది. వర్షాకాలం అమ్మకాలు ఉండవు. శీతాకాలంలో ప్రమిదలు, పూజా సామగ్రి తయారు చేసి విక్రయిస్తాం.

- సుశీల

-హైదరాబాద్, షాపూర్‌నగర్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2023-04-03T13:19:37+05:30 IST