Karnataka Opinion Poll: 4 శాతం ముస్లిం కోటా రద్దు ప్రభావం బీజేపీపై ఏవిధంగా ఉంటుందంటే..?

ABN , First Publish Date - 2023-05-07T18:06:10+05:30 IST

కర్ణాటకలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ, ఈసారి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని

Karnataka Opinion Poll: 4 శాతం ముస్లిం కోటా రద్దు ప్రభావం బీజేపీపై ఏవిధంగా ఉంటుందంటే..?

బెంగళూరు: కర్ణాటకలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ (BJP), ఈసారి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ (Congress) సాగిస్తున్న హోరాహోరీ ఎన్నితస ప్రచారం మధ్య సీఎం బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) తీసుకున్న ముస్లిం కోటా రద్దు ప్రభావం బీజేపీపై ఎలా ఉండబోతోంది?. ముస్లింలకు కేటాయించిన 4 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేస్తూ, ఆ కోటాను లింగాయత్, వొక్కలిక కమ్యూనిటీలకు సమంగా సీఎం బసవరాజ్ బొమ్మై సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం కేటాయించింది. దీనిపై టీవీ-సీఎన్ఎక్స్ (TV-CNX) ఒపీనియన్ పోల్ (Opinion Poll) నిర్వహించింది.

ఒపీనియన్ పోల్ ఏమి చెప్పిందంటే..?

ముస్లిం రిజర్వేషన్లకు ముగింపు పలుకుతూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి 54 శాతం మంది మద్దతు తెలిపారు. 25 శాతం మంది నిరసన వ్యక్తం చేశారు. 21 శాతం మంది ఎటూ తేల్చిచెప్పలేకపోయారు. సర్వేలో పాల్గొన్నవారంతా ముస్లిమేతరులు కావడం విశేషం. ఈనెల 1 నుంచి 6వ తేదీ వరకూ 112 నియోజకవర్గాల్లోని 11,120 మంది అభిప్రాయాలను టీవీ-సీఎన్ఎక్స్ సేకరించింది. వీరిలో 5,620 మంది పురుషులు, 5,580 మంది స్త్రీలు ఉన్నారు. ఈనెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 8వ తేదీ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మే 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2023-05-07T21:32:53+05:30 IST