TS Tenth Inter Supplementary Results: తెలంగాణ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్
ABN , First Publish Date - 2023-07-07T15:34:05+05:30 IST
తెలంగాణలో పదో తరగతి, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ పరీక్ష ఫలితాలను ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు విడుదల చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి (Tenth), ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల (Inter Supplementary Results) ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ పరీక్ష ఫలితాలను ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు విడుదల చేశారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో 80.59 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. జూన్ 14 నుంచి ఈ పరీక్షలు జరగ్గా.. 66,732మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని అధికారులు తెలిపారు.
ఇలాగే మొదటి, సెకండియర్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 12 నుంచి 20 వరకు జరిగాయి. తక్కువ సమయంలోనే ఫలితాలను విడుదల చేశారు.