AP పశుసంవర్థకశాఖలో సర్జన్‌ పోస్టుల భర్తీ.. వారు మాత్రమే అర్హులు!

ABN , First Publish Date - 2023-03-21T15:24:46+05:30 IST

విజయవాడలోని ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ యానిమల్‌ హస్బెండరీ (పశుసంవర్థకశాఖ)లో ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ఖాళీల కేటగిరీ కింద

AP పశుసంవర్థకశాఖలో సర్జన్‌ పోస్టుల భర్తీ.. వారు మాత్రమే అర్హులు!
AP పశుసంవర్థకశాఖ

విజయవాడలోని ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ యానిమల్‌ హస్బెండరీ (పశుసంవర్థకశాఖ)లో ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ఖాళీల కేటగిరీ కింద వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌(క్లాస్‌ ఏ/ బీ): 27 పోస్టులు.

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ(వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హస్బెండరీ) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 2022 జూలై 1 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.54,060 - రూ.1,40,540.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను పశుసంవర్థక సంచాలకుల కార్యాలయం, లబ్బీపేట, విజయవాడ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 25

వెబ్‌సైట్‌: https://ahd.aptonline.in/AHMS/Views/Home.aspx

Updated Date - 2023-03-21T15:24:46+05:30 IST