నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. బీబీనగర్‌లో ఎన్ని పోస్టులంటే..!

ABN , First Publish Date - 2023-04-17T17:09:51+05:30 IST

న్యూఢిల్లీ(New Delhi)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(ఎయిమ్స్‌) (AIIMS)తో పాటు దేశవ్యాప్తంగా

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. బీబీనగర్‌లో ఎన్ని పోస్టులంటే..!

న్యూఢిల్లీ(New Delhi)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(ఎయిమ్స్‌) (AIIMS)తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన నర్సింగ్‌ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్‌ కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నార్‌సెట్‌)-4 నోటిఫికేషన్‌ వెలువడింది. దరఖాస్తుకు చివరి తేదీ మే 5.

సంస్థల వారీగా ఖాళీలు వివరాలు

1. ఎయిమ్స్‌ భటిండా- 142

2. ఎయిమ్స్‌ భోపాల్‌ - 51

3. ఎయిమ్స్‌ భువనేశ్వర్‌ - 169

4. ఎయిమ్స్‌ బీబీనగర్‌ - 150

5. ఎయిమ్స్‌ బిలాస్‌పూర్‌ - 178

6. ఎయిమ్స్‌ దేవ్‌గఢ్‌ - 100

7. ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్‌ - 121

8. ఎయిమ్స్‌ జోధ్‌పూర్‌- 300

9. ఎయిమ్స్‌ కల్యాణి - 24

10. ఎయిమ్స్‌ మంగళగిరి - 117

11. ఎయిమ్స్‌ నాగ్‌పూర్‌ - 87

12. ఎయిమ్‌ రాయ్‌బరేలి - 77

13. ఎయిమ్స్‌ న్యూఢిల్లీ - 620

14. ఎయిమ్‌ పట్నా - 200

15. ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌- 150

16. ఎయిమ్స్‌ రాజ్‌కోట్‌- 100

17. ఎయిమ్స్‌ రిషికేశ్‌ - 289

18. ఎయిమ్స్‌ విజయ్‌పూర్‌ - 180

అర్హత: డిప్లొమా(జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ(ఆనర్స్‌) నర్సింగ్‌/బీఎస్సీ నర్సింగ్‌/బీఎస్సీ(పోస్ట్‌ సర్టిఫికెట్‌)/పో‌స్ట్-బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్‌/ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.

వయోపరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్‌- సర్వీ్‌సమన్‌కు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు: రూ.9300-రూ.34,800తో పాటు రూ.4600 గ్రేడ్‌ పే అందుతుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీ అభ్యర్థులకు రూ.3000; ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2400; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: నార్‌సెట్‌-4 స్కోరు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: పరీక్ష వ్యవధి 3 గంటలు. ఆబ్జెక్టివ్‌ విధానంలో 200 ప్రశ్నలు, 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. సబ్జెక్టుకు సంబంధించి 180 ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంది. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే 1/3 మార్కులు కోత విధిస్తారు.?

వెబ్‌సైట్‌: https://www.aiimsexams.ac.in/ index.html

Updated Date - 2023-04-17T17:09:51+05:30 IST