Railway Jobs: ఐటీఐ ఉత్తీర్ణతతో సదరన్ రైల్వేలో పోస్టులు
ABN , First Publish Date - 2023-08-10T18:26:44+05:30 IST
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ) సదరన్ రైల్వేలో పనిచేయడానికి జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు 790
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ) సదరన్ రైల్వేలో పనిచేయడానికి జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ లోకో పైలెట్, టెక్నీషియన్ గ్రేడ్-1, గ్రేడ్-3 అండ్ గార్డ్/ట్రెయిన్ మేనేజర్
విభాగాలు: డీజిల్, సిగ్నల్, వెల్డర్, కార్పెంటర్, మాసన్, ప్లంబర్, ఎలక్ట్రికల్ పవర్ తదితరాలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్/ఎ్‌సఎ్‌సఎల్‌సీ/ఐటీఐ/ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 42 ఏళ్లు ఉండాలి
ఎంపిక విధానం: జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 30
వెబ్‌సైట్: rrcmas.in/