Jobs: ఐటీఐ ఉత్తీర్ణతతో ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు

ABN , First Publish Date - 2023-09-01T11:23:22+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్‌టీసీ), నెల్లూరు జోన్‌... కింద పేర్కొన్న ట్రేడ్‌లలో అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.

Jobs: ఐటీఐ ఉత్తీర్ణతతో ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు

ఖాళీలు 300

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్‌టీసీ), నెల్లూరు జోన్‌... కింద పేర్కొన్న ట్రేడ్‌లలో అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు www.apprenticeshipindia.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

జిల్లాల వారీగా ఖాళీలు: చిత్తూరు - 46, తిరుపతి - 102, నెల్లూరు - 96, ప్రకాశం - 56.

ట్రేడులు: డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, పెయింటర్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌

అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి

ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఫీజు: రూ.100

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 8

రెజ్యూమె, సర్టిఫికెట్‌ జిరాక్స్‌ కాపీలను పంపడానికి చివరి తేదీ: సెప్టెంబరు 11

పంపాల్సిన సర్టిఫికెట్‌ జిరాక్స్‌ కాపీలు: ఎస్‌ఎ్‌ససీ మార్క్స్‌ లిస్ట్‌, ఐటీఐ మార్క్స్‌(కన్సాలిడేటెడ్‌ మార్క్స్‌ మెమో) అలాగే కులం, దివ్యాంగులు, మాజీ సైనికుల పిల్లలు ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌పరంగా అర్హులైతే వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డు.

చిరునామా: ప్రిన్సిపాల్‌, జోనల్‌ స్టాఫ్‌ ట్రెయినింగ్‌ కాలేజ్‌, కకుటూర్‌, వెంకటాచలం మండలం, ఎస్‌పీఎ్‌సఆర్‌ నెల్లూరు జిల్లా, పిన్‌కోడ్‌-524320

Updated Date - 2023-09-01T11:23:22+05:30 IST