Notification: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌ ఉద్యోగాలు

ABN , First Publish Date - 2023-03-08T12:22:18+05:30 IST

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (Indian Air Force).... అగ్నిపథ్‌ స్కీంలో (Agnipath Scheme) భాగంగా ‘అగ్నివీర్‌ వాయు’ నియామకాలకు నోటిఫికేషన్‌

Notification: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌ ఉద్యోగాలు
అగ్నివీర్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (Indian Air Force).... అగ్నిపథ్‌ స్కీంలో (Agnipath Scheme) భాగంగా ‘అగ్నివీర్‌ వాయు’ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మేథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లీష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/ఇంటర్మీడియట్‌(సైన్స్‌ కాకుండా ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా (మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/ఆటోమొబైల్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 2002 డిసెంబరు 26 నుంచి 2006 జూన్‌ 26 మధ్య జన్మించి ఉండాలి.

ఎత్తు: పురుషులు 152.5 సెం.మీ; మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఫేజ్‌-1(ఆన్‌లైన్‌ రాత పరీక్ష), ఫేజ్‌-2

(ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, అడాప్టబిలిటీ టెస్ట్‌-1, అడాప్టబిలిటీ టెస్ట్‌-2), ఫేజ్‌-3(మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌), ధ్రుపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా

పరీక్ష ఫీజు: రూ.250

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: మార్చి 17

చివరి తేదీ: మార్చి 31

ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం: మే 20

వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in/AV/

ఇది కూడా చదవండి: Free Beer Offer: రెండు బీర్లు ఫ్రీ అంటూ ఊరంతా పోస్టర్లు.. ఒకే ఒక్క కండీషన్ పెట్టినా క్యూ కట్టిన జనం..!

Updated Date - 2023-03-08T12:22:18+05:30 IST