Hyderabad Jntuలో పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2023-01-04T12:53:19+05:30 IST

హైదరాబాద్‌ (Hyderabad)లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (Jawaharlal Nehru Technological University)(జేఎన్‌టీయూహెచ్‌)- ఏఐసీటీఈ డాక్టోరల్‌

Hyderabad Jntuలో పీహెచ్‌డీ
పీహెచ్‌డీ

హైదరాబాద్‌ (Hyderabad)లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (Jawaharlal Nehru Technological University)(జేఎన్‌టీయూహెచ్‌)- ఏఐసీటీఈ డాక్టోరల్‌ ఫెలోషిప్(ఏడీఎఫ్‌) స్కీం కింద ఫుల్‌ టైం పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ (Full Time PhD Programme)లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పది సీట్లు ఉన్నాయి. గత అయిదేళ్లలో నిర్వహించిన గేట్‌/ నెట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌, ఇంటర్వ్యూల ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. రిసెర్చ్‌ వర్క్‌ను అనుసరించి మరో ఏడాది పొడిగించే వీలుంది. అడ్మిషన్‌(Admission) పొందిన అభ్యర్థులు వారానికి ఎనిమిది గంటలు టీచింగ్‌ అసిస్టెన్స్‌ కింద ల్యాబ్‌ క్లాసెస్‌, ట్యుటోరియల్‌ సపోర్ట్‌ తదితర బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.

ఇంజనీరింగ్‌ విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌

పరిశోధనాంశాలు: గ్రీన్‌ టెక్నాలజీస్‌, బిగ్‌ డేటా-మెషిన్‌ లెర్నింగ్‌-డేటా సైన్సెస్‌, బ్లాక్‌ చెయిన్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎనర్జీ ప్రొడక్షన్‌ అండ్‌ స్టోరేజ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఫొటోనిక్స్‌, న్యూక్లియర్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ అలైడ్‌ టెక్నాలజీస్‌, రోబోటిక్స్‌ అండ్‌ మెకట్రానిక్స్‌, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ/వర్చువల్‌ రియాలిటీ, ఎనర్జీ ఎఫిషియెన్సీ-రెన్యూవబుల్‌ అండ్‌ సస్టయినబుల్‌ ఎనర్జీ, స్మార్ట్‌ సిటీ్‌స-హౌసింగ్‌-ట్రాన్స్‌పోర్టేషన్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, 3డీ ప్రింటింగ్‌, క్వాంటం కంప్యూటింగ్‌, స్మార్ట్‌ టెక్నాలజీస్‌ - అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ ఇండస్ట్రీ, వాటర్‌ ప్యూరిఫికేషన్‌-కన్జర్వేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, పబ్లిక్‌ పాలసీ, సోషల్‌ అండ్‌ ఆర్గనైజేషనల్‌ సైకాలజీ అండ్‌ బిహేవియర్‌, సైబర్‌ సెక్యూరిటీ.

అర్హత: సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో కనీసం 70 శాతం మార్కులతో బీటెక్‌, ఎంటెక్‌ పూర్తిచేసి ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 65 శాతం మార్కులు చాలు. అభ్యర్థులందరికీ నెట్‌/గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ తప్పనిసరి. అడ్మిషన్‌ నాటికి అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. టీఈక్యూఐపీ స్కీం కింద పనిచేస్తున్న ఫ్యాకల్టీ మెంబర్లకు ప్రాధాన్యం ఇస్తారు.

ముఖ్య సమాచారం

ప్రోగ్రామ్‌ ఫీజు: ఏడాదికి రూ.20,000

దరఖాస్తు ఫీజు: రూ.2,000

అడ్మిషన్‌ ఫీజు: రూ.1500

రిజిస్టర్డ్‌ పోస్ట్‌/ కొరియర్‌ ద్వారా దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: జనవరి 9

దరఖాస్తుకు జతచేయాల్సినవి: బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌ సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు; టీసీ, మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌; డిగ్రీ, పీజీ స్టడీ సర్టిఫికెట్‌లు; నెట్‌/ గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ కార్డ్‌; పదోతరగతి సర్టిఫికెట్‌

ఇంటర్వ్యూలు: జనవరి 11న

దరఖాస్తు పంపాల్సిన చిరునామా, ఇంటర్వ్యూ వేదిక: డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ కార్యాలయం, జేఎన్‌టీయూహెచ్‌, కూకట్‌పల్లి, హైదరాబాద్‌-500085

వెబ్‌సైట్‌: jntuh.ac.in

Updated Date - 2023-01-04T12:53:29+05:30 IST