టెన్త్ ఉత్తీర్ణులైన వారికి అంబేద్కర్‌ యూనివర్సిటీలో సర్టిఫికెట్‌ కోర్సు

ABN , First Publish Date - 2023-05-03T17:06:56+05:30 IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ-‘సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌’లో ప్రవేశానికి

టెన్త్ ఉత్తీర్ణులైన వారికి అంబేద్కర్‌ యూనివర్సిటీలో సర్టిఫికెట్‌ కోర్సు
Certificate course

శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ-‘సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌’లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి ఆర్నెల్లు. గరిష్ఠంగా ఆరేళ్లలో పూర్తి చేయవచ్చు. ప్రోగ్రామ్‌ మొత్తానికి 24 క్రెడిట్స్‌ నిర్దేశించారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన ఉంటుంది. కనీసం పదోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 50 సీట్లు ఉన్నాయి.

ప్రోగ్రామ్‌ వివరాలు

  • ప్రి-ప్రైమరీ స్కూళ్లలో అనుసరించాల్సిన టీచింగ్‌-లెర్నింగ్‌ పద్ధతులు, ప్రి స్కూల్‌ మేనేజ్‌మెంట్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, క్లాస్‌ రూం మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్‌ తదితరాలపై శిక్షణ ఉంటుంది.

  • ప్రోగ్రామ్‌లో భాగంగా థియరీ పేపర్లు, ఇంటర్న్‌షిప్‌, యాక్టివిటీస్‌ రికార్డ్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. నెల రోజులపాటు అకడమిక్‌ కౌన్సెలింగ్‌లో శిక్షణ ఇస్తారు. కనీసం 75 శాతం అటెండెన్స్‌ తప్పనిసరి.

థియరీ పేపర్లు: ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, సిగ్నిఫికెన్స్‌ ఆఫ్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, ప్లానింగ్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌, అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ప్రి స్కూల్‌ అండ్‌ డే కేర్‌ సెంటర్స్‌, పెడగాగి ఆఫ్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌

కోర్సు ఫీజు: రూ.5,000

దరఖాస్తు ఫీజు: రూ.250

ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 15

చిరునామా: రిజిస్ట్రార్‌, కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌-కామర్స్‌-లా-ఎడ్యుకేషన్‌, డా.బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ, ఎచ్చెర్ల-532410, శ్రీకాకుళం

వెబ్‌సైట్‌: www.brau.edu.in

Updated Date - 2023-05-03T17:06:56+05:30 IST